తెలంగాణ

telangana

ETV Bharat / sports

టెస్టు ర్యాంకింగ్స్​: కోహ్లీ నెం 1, బుమ్రా@7 - ashes

ఐసీసీ తాజాగా టెస్టు ర్యాంకింగ్స్​ ప్రకటించింది. బ్యాట్స్​మెన్ల జాబితాలో మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు భారత స్టార్​ బ్యాట్స్​మెన్​  విరాట్​ కోహ్లీ. టీమిండియా పేసర్​ బుమ్రా కెరీర్​ అత్యుత్తమ ర్యాంకు అందుకున్నాడు.

టెస్టు ర్యాంకింగ్స్​: కోహ్లీ నెం 1, బుమ్రా@7

By

Published : Aug 27, 2019, 5:51 PM IST

Updated : Sep 28, 2019, 11:52 AM IST

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్​లో విరాట్​ కోహ్లీ అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు. 910 పాయింట్లతో మొదటి స్థానంలో ఉన్న భారత సారథికి... 904 పాయింట్లతో రెండో ర్యాంక్​లో ఉన్న ఆసీస్​ బ్యాట్స్​మెన్​ స్టీవ్​ స్మిత్​ గట్టి పోటీనిస్తున్నాడు. వీరిద్దరి మధ్య 6 పాయింట్ల అంతరం మాత్రమే ఉంది.

బ్యాటింగ్​ విభాగంలో కివీస్​ ఆటగాడు కేన్​ విలియమ్సన్​, భారత క్రికెటర్​ ఛతేశ్వర్​ పుజారా 3, 4 స్థానాల్లో నిలిచారు. టెస్టుల్లో టీమిండియా వైస్​ కెప్టెన్​ అజింక్య రహానే 11వ స్థానం దక్కించుకున్నాడు. ఇటీవల విండీస్​తో జరిగిన తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్​ల్లో వరుసగా 81, 102 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనతో 10 స్థానాలు మెరుగుపర్చుకున్నాడు.

టెస్టుల్లో అత్యుత్తమంగా బుమ్రా, కోహ్లీ

బుమ్రా బెస్ట్​...

టీమిండియా స్పీడ్​స్టర్​ జస్​ప్రీత్​ బుమ్రా టెస్టుల్లో కెరీర్​ అత్యుత్తమ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇప్పటికే వన్డేల్లో టాప్​ బౌలర్​గా ఉన్న బుమ్రా... టెస్టు ర్యాంకింగ్స్​లో 7వ స్థానం కైవసం చేసుకున్నాడు.

ప్రస్తుతం విండీస్​తో రెండు టెస్టుల సిరీస్ ఆడుతోంది భారత జట్టు. ఇటీవల జరిగిన తొలి టెస్టులో 5 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేశాడు బుమ్రా. ఫలితంగా 9 స్థానాలు మెరుగుపర్చుకున్నాడు. టెస్టుల్లో వేగంగా 50 వికెట్లు తీసిన భారత పేసర్​గా రికార్డు సృష్టించాడు. బౌలింగ్​ విభాగంలో అగ్రస్థానంలో పాట్​ కమిన్స్​ (ఆస్ట్రేలియా) ఉన్నాడు. మరో టీమిండియా ప్లేయర్​ జడేజా 10వ స్థానంలో నిలిచాడు.

ఆల్​రౌండర్​ విభాగంలో ఇంగ్లాండ్​ ఆటగాడు బెన్​స్టోక్స్​ 2వ ర్యాంక్​ సాధించాడు.విండీస్​ ఆల్​రౌండర్​ జేసన్​ హోల్డర్​ టాప్​లో కొనసాగుతున్నాడు. యాషెస్​లో సత్తా చాటుతోన్న స్టోక్స్​... మూడో టెస్టులో అద్భుత ప్రదర్శన చేశాడు. ఫలితంగా బ్యాట్స్​మెన్​ విభాగంలోనూ 13వ స్థానంలో నిలిచాడు.

ఇదీ చదవండి...'ఫిరోజ్​ షా కోట్లా' పేరు మారిందిలా...!

Last Updated : Sep 28, 2019, 11:52 AM IST

ABOUT THE AUTHOR

...view details