తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీ20 ర్యాంకింగ్స్​: టాప్​ 10లోకి దూసుకెళ్లిన విరాట్​

అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ఐసీసీ ) తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్​లో టాప్​-10లో నిలిచాడు కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఇప్పటికే వన్డేలు, టెస్టుల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడీ స్టార్​ బ్యాట్స్​మన్​.

ICC T20I rankings 2019: Virat Kohli reaches into top 10 after heroic innings vs West Indies
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్​: టాప్​ 10లోకి దూసుకెళ్లిన విరాట్​

By

Published : Dec 12, 2019, 4:51 PM IST

Updated : Dec 12, 2019, 9:27 PM IST

విరాట్​ కోహ్లీ... క్రికెట్​లో పరుగుల వరద పారిస్తూ.. ఎందరో దిగ్గజాల రికార్డులను అలవోకగా అధిగమిస్తున్నాడు. ఫార్మాట్​తో పని లేకుండా బ్యాట్​కు పనిచెప్పే ఈ టీమిండియా సారథి... అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ఐసీసీ) తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్​లో 10వ స్థానం సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే వన్డేలు, టెస్టుల్లో అగ్రస్థానంలో ఉన్న ఈ స్టార్​ బ్యాట్స్​మన్​.. మూడు ఫార్మాట్లలో టాప్​-10లో నిలిచిన ఏకైక క్రికెటర్​గా ఘనత సాధించాడు.

వెస్టిండీస్​తో టీ20 సిరీస్​కు​ ముందు టాప్​-15లో ఉండేవాడు విరాట్​. కరీబియన్​ జట్టుపై జరిగిన 3 మ్యాచ్​ల్లో 94*, 19, 70 పరుగులు చేసి మొత్తంగా 183 రన్స్​ సాధించాడు. ఈ ప్రదర్శన కారణంగా 5 స్థానాలు ఎగబాకి 685 పాయింట్లతో పదో స్థానం దక్కించుకున్నాడు.

కేఎల్​ రాహుల్​(734 పాయింట్లు) ఆరో స్థానంలో, రోహిత్​ శర్మ(686) తొమ్మిదో స్థానంలో ఉన్నారు. టాప్​-10లో ముగ్గురు భారత బ్యాట్స్​మెన్ ఉండటం విశేషం.

రికార్డులే రికార్డులు

టీ20ల్లో అత్యధిక పరుగులు(2633) చేసిన ఆటగాడిగా రోహిత్​ శర్మతో కలిసి అగ్రస్థానం పంచుకున్నాడు కోహ్లీ. భారత స్టార్​ ఓపెనర్​ రోహిత్..​ ఈ స్కోరును 104 ఇన్నింగ్స్​ల్లో అందుకోగా, కోహ్లీ 75 ఇన్నింగ్స్​ల్లో సాధించాడు. అంతేకాకుండా వరుసగా నాలుగో ఏడాది ఈ ఫార్మాట్​లో టాప్​ స్కోరర్​గా నిలవడం విశేషం.

విండీస్​తో సిరీస్​లో 'మ్యాన్​ ఆఫ్​ ద సిరీస్'​ అందుకున్న కింగ్​ కోహ్లీ... అత్యధిక సార్లు(6) ఈ ఫార్మాట్​లో అవార్డు అందుకున్న బ్యాట్స్​మన్​గా రికార్డు సృష్టించాడు. మూడు ఫార్మాట్లలో 50 శాతం కన్నా ఎక్కువ సగటుతో ఉన్న క్రికెటర్​గా ఓ రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. స్వదేశంలో ఈ ఫార్మాట్​లో వెయ్యి పరుగులకు(1064) పైగా చేసిన తొలి భారతీయుడిగా ఘనత సాధించాడు.

కోహ్లీ.. ఇప్పటివరకు 84 టెస్టులు ఆడి 7202 పరుగులు చేశాడు. 239 వన్డేల్లో 11520​, 75 టీ20ల్లో 2633 పరుగులు​ సాధించాడు.

ఇవీ చూడండి...

Last Updated : Dec 12, 2019, 9:27 PM IST

ABOUT THE AUTHOR

...view details