ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీ20 ప్రపంచకప్​: వరుణుడు కరుణిస్తే భారత్​ ఫైనల్​కే! - NO Reserve Day in Womens T20 WC Semi Finals

మహిళల టీ20 ప్రపంచకప్​లో సెమీస్​ మ్యాచ్​లకు 'రిజర్వ్​డే' ఏర్పాటు చేయాలన్న ఆస్ట్రేలియా బోర్డు ప్రతిపాదనను అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ఐసీసీ) తిరస్కరించింది.

NO Reserve Day in Womens T20 WC Semi Finals
టీ20 ప్రపంచకప్​ సెమీస్​లో వర్షం పడితే భారత్​కే లాభం!
author img

By

Published : Mar 4, 2020, 1:32 PM IST

Updated : Mar 4, 2020, 1:47 PM IST

మహిళల టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో తలపడే జట్లు ఖరారయ్యాయి. తొలి సెమీఫైనల్లో మాజీ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌ను భారత్‌... రెండో సెమీఫైనల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా ఢీకొంటాయి. ఈ రెండు మ్యాచ్‌లు సిడ్నీ వేదికగా గురువారం జరగనున్నాయి. వీటికి ఆతిథ్యమివ్వబోతున్న సిడ్నీని వరుణుడు ముంచెత్తే అవకాశముందని అక్కడి వాతావరణ శాఖ భావిస్తోంది.

మంగళవారం.. గ్రూప్‌-బిలో ఇక్కడే జరిగిన చివరి రెండు మ్యాచ్‌లు వర్షం వల్ల రద్దయ్యాయి. సెమీస్​లోనూ సిడ్నీలో వర్షం పడుతుందని, మ్యాచ్‌లు సజావుగా సాగడం సందేహమేనని సమాచారం. ఒకవేళ వర్షంతో మ్యాచ్‌లు రద్దయితే.. గ్రూప్‌ దశను అగ్రస్థానాలతో ముగించిన భారత్‌, దక్షిణాఫ్రికాలు ఫైనల్​ చేరుతాయి. ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా నిష్క్రమిస్తాయి. ఈనెల 8న మెల్​బోర్న్​లో టైటిల్​ పోరు జరగనుంది.

in article image
సెమీఫైనల్​ చేరిన భారత్​, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్​, ఆస్ట్రేలియా జట్ల సారథులు

ఆస్ట్రేలియా ప్రతిపాదన తిరస్కరణ

సెమీఫైనల్లో 'రిజర్వ్​ డే' పెట్టాలన్న ఆస్ట్రేలియా బోర్డు వినతిని, తాజాగా తోసిపుచ్చింది అంతర్జాతీయ క్రికెట్​ మండలి. ప్రణాళిక ప్రకారం ముందుగా ప్రకటించిన తేదీల్లోనే మ్యాచ్​లు జరుగుతాయని, మరో రోజును కేటాయించడం కుదరదని స్పష్టం చేసింది. ఈ ఏడాది అక్టోబరులో పురుషుల టీ20 ప్రపంచకప్​నకు ఇదే నిబంధన వర్తించనుంది.

గతేడాది వన్డే ప్రపంచకప్​లో వర్షం కారణంగా భారత్​-న్యూజిలాండ్​ సెమీస్​ మ్యాచ్​ తర్వాతి రోజు నిర్వహించారు. ఇందులో వాతావరణం టీమిండియాకు ప్రతికూలంగా మారడం వల్ల టోర్నీలో ఓడిపోయి నిష్క్రమించింది.

Last Updated : Mar 4, 2020, 1:47 PM IST

ABOUT THE AUTHOR

...view details