మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో ఇద్దరు క్రికెటర్లపై ఐసీసీ కొరడా ఝుళిపించింది. 2019 ప్రపంచకప్ అర్హత పోటీల్లో ఫిక్సింగ్‌కు పాల్పడినందుకు యూఏఈ క్రికెటర్లు మహ్మద్ నవీద్, షైమన్ అన్వర్‌పై ఎనిమిదేళ్లు నిషేధం విధించింది. 2019, అక్టోబర్ 16 నుంచి శిక్ష అమల్లోకి వస్తుందని తెలిపింది. ప్రాథమికంగా తప్పు చేసినట్టు తేలడం వల్ల రెండేళ్ల క్రితమే వారిపై తాత్కాలిక నిషేధం అమలు చేసింది.
మ్యాచ్ ఫిక్సింగ్.. ఇద్దరు క్రికెటర్లపై నిషేధం - నవీద్, షైమన్పై నిషేధం
మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిన ఇద్దరు యూఏఈ క్రికెటర్లపై ఎనిమిదేళ్ల నిషేధం విధించింది ఐసీసీ. 2019, అక్టోబర్ 16 నుంచి ఈ శిక్ష అమల్లోకి వస్తుందని తెలిపింది.
కుడిచేతి వాటం పేసరైన నవీద్ (32 ఏళ్లు) యూఏఈ తరఫున 39 వన్డేలు, 31 టీ20లు ఆడాడు. జట్టుకు సారథ్యం వహించాడు. 42 ఏళ్ల మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ బట్ 40 వన్డేలు, 32 టీ20లు ఆడాడు.
"మహ్మద్ నవీద్, షైమన్ అన్వర్ యూఏఈ తరఫున అత్యున్నత స్థాయి క్రికెట్ ఆడారు. నవీద్ జట్టుకు సారథి. జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీశాడు. అన్వర్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గానూ సేవలందించాడు. సుదీర్ఘ కాలంగా ఆడుతున్న వీరికి మ్యాచ్ ఫిక్సర్ల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. దాంతో వారు సహచరులు, ప్రత్యర్థులు, అభిమానులను మోసం చేశారు" అని ఐసీసీ తెలిపింది.