తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC19: మెగాటోర్నీలో ముగ్గురు భారత కామెంటేటర్లు - ganguly

ప్రపంచకప్​ పాల్గొనే కామెంటేటర్ల జాబితాను విడుదల చేసింది ఐసీసీ. ఇందులో భారత్​కు చెందిన సంజయ్ మంజ్రేకర్, గంగూలీ, హర్షా భోగ్లే చోటు దక్కించుకున్నారు.

WC19: మెగాటోర్నీలో ముగ్గురు భారత కామెంటేటర్లు

By

Published : May 17, 2019, 2:10 PM IST

మే 30న ప్రారంభమయ్యే ప్రపంచకప్​లో పాల్గొనే కామెంటేటర్ల పేర్లు వెల్లడించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ). మొత్తం 24 మందితో ఉన్న ఈ జాబితాలో భారత్​ నుంచి హర్షా భోగ్లే, గంగూలీ, సంజయ్ మంజ్రేకర్ చోటు దక్కించుకున్నారు.

హర్షా భోగ్లే

మిగతా వారిలో ఇంగ్లాండ్‌ నుంచి నలుగురు.. న్యూజిలాండ్‌ నుంచి ముగ్గురు.. దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ తరపున తలో ఇద్దరు.. బంగ్లాదేశ్‌, శ్రీలంక, జింబాబ్వే నుంచి ఒక్కొక్కరు ఉన్నారు.

మే 30 న వన్డే క్రికెట్ ప్రపంచకప్​ ప్రారంభం

ప్రపంచకప్​ కామెంటేటర్ల పూర్తి జాబితా

నాసీర్‌ హుస్సేన్‌, మైకేల్‌ క్లార్క్‌, ఇయాన్‌ బిషప్‌, సౌరవ్‌ గంగూలీ, మిలేనీ జోన్స్‌, కుమార సంగక్కర, మైకేల్‌ అథర్టన్‌, అలిసన్‌ మిచెల్‌, బ్రెండన్‌ మెక్​కల్లమ్‌, గ్రేమ్‌ స్మిత్‌, వసీం అక్రమ్‌, షాన్‌ పొలాక్‌, మైఖేల్‌ స్లేటర్‌, మార్క్‌ నికోలస్‌, మైఖేల్‌ హోల్డింగ్‌, ఇషా గుహ, పొమ్మి ఎంబాగ్వా, సంజయ్‌ మంజ్రేకర్‌, హర్షా భోగ్లే, సిమోన్‌ డౌల్‌, ఇయాన్‌ స్మిత్‌, రమీజ్‌ రాజా, అధర్‌ అలీ ఖాన్‌, ఇయాన్‌ వార్డ్‌

ABOUT THE AUTHOR

...view details