వన్డే ర్యాంకింగ్స్‌ను మంగళవారం విడుదల చేసింది అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ). బ్యాట్స్మెన్ల జాబితాలో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తొలి రెండు స్థానాలను ఆక్రమించగా.. బౌలింగ్ లిస్ట్‌లో జస్ప్రీత్ బుమ్రా రెండో స్థానంలో నిలిచాడు.
టాప్ బ్యాట్స్మెన్లు
871 పాయింట్లతో కోహ్లీ అగ్రస్థానంలో, 855 పాయింట్లతో రోహిత్ శర్మ రెండో స్థానంలో, 829 పాయింట్లతో పాకిస్థాన్‌కు చెందిన బాబర్ అజామ్ మూడో స్థానంలో ఉన్నారు.
టాప్ బౌలర్స్
బౌలర్ల జాబితాలో న్యూజిలాండ్‌కు చెందిన పేసర్ ట్రెంట్ బౌల్డ్ 722 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. 719 పాయింట్లతో బుమ్రా రెండో స్థానానికి పరిమితమయ్యాడు. మూడో స్థానంలో అఫ్ఘానిస్థాన్‌కు చెందిన ముజిబుర్ రెహ్మన్(701) నిలిచాడు.
ఆల్‌రౌండర్లు
ఆల్‌రౌండర్స్ టాప్-10 ర్యాంకింగ్స్‌లో ఏకైక భారతీయుడు రవీంద్ర జడేజా. అతడు ఎనిమిదో స్థానానికి పరిమితమయ్యాడు. ఈ విభాగంలో అఫ్ఘాన్‌కు చెందిన ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ అగ్రస్థానంలో ఉండగా.. అతని తర్వాత రెండో స్థానంలో ఇంగ్లాండ్‌కు చెందిన బెన్ స్టోక్స్ ఉన్నాడు.