ఈ ఏడాది భారత్‌లో టీ20 ప్రపంచకప్‌ను షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని ఐసీసీ మధ్యంతర సీఈఓ జియోఫ్ అలార్డైస్ చెప్పారు. ప్రత్యామ్నయ ప్రణాళికలు ఉన్నప్పటికీ వాటి గురించి ప్రస్తుతం ఆలోచించట్లేదని తెలిపారు. మరో రెండు నెలలో జరగాల్సిన 'ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్'ను అనుకున్న తేదీకే నిర్వహిస్తామని అన్నారు.
టీ20 ప్రపంచకప్ నిర్వహణపై ఐసీసీ సీఈఓ క్లారిటీ - cricket news
ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌తో పాటు టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌ను అనుకున్న తేదీ ప్రకారం నిర్వహిస్తామని ఐసీసీ మధ్యంతర సీఈఓ స్పష్టం చేశారు. తాజాగా జరిగిన వర్చువల్ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
భారత్‌లో టీ20 ప్రపంచకప్ అనుకున్న తేదీకే!
భారత్‌లో రెండో వేవ్‌లో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రోజుకు లక్షకు పైగా పాజిటివ్ కేసులు నిర్ధరణ అవుతున్నాయి. ఈ క్రమంలో అక్టోబరు-నవంబరులో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌పై సందేహాలు వ్యక్తమవుతుండగా, ఆ విషయంపై స్పష్టత ఇచ్చారు జియోఫ్. అయితే యూఏఈని టీ20 ప్రపంచకప్ ప్రత్యమ్నాయ వేదికగా అనుకుంటున్నట్లు తెలుస్తోంది.