దక్షిణాఫ్రికా వేదికగా 2022లో జరగాల్సిన మహిళల టీ20 ప్రపంచకప్ 2023కు వాయిదా పడింది. క్రీడాకారిణులపై ఒత్తిడి తగ్గించడం కోసం, పెద్ద టోర్నీల మధ్య దూరాన్ని పెంచేందుకు 2022 నవంబర్ నుంచి 2023 ఫిబ్రవరికి ఈ టోర్నీని మార్చినట్లు ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ).
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2023కు వాయిదా - మహిళల టీ20 ప్రపంచకప్ వాయిదా
మహిళా టీ20 ప్రపంచకప్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వాయిదా వేసింది. క్రీడాకారిణులపై ఒత్తిడి తగ్గించడం కోసమే దక్షిణాఫ్రికా వేదికగా 2022లో జరగాల్సిన ఈ టోర్నీని 2023కు మార్చినట్లు ప్రకటించింది.
వచ్చే ఏడాది న్యూజిలాండ్ వేదికగా జరగాల్సిన మహిళల వన్డే ప్రపంచకప్‌ను కరోనా మహమ్మారి కారణంగా.. ఐసీసీ 2022కు వాయిదా వేసింది. అదే ఏడాది బర్మింగ్‌హమ్‌లో జరిగే కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారి మహిళల టీ20 ఈవెంట్ భాగం కావాల్సి ఉండేది.
"మహిళల టీ20 ప్రపంచకప్‌ను వాయిదా వేయకపోతే 2022లో మూడు మేజర్ ఈవెంట్లు (కామన్వెల్త్ క్రీడలు, వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్) నిర్వహించాల్సి ఉంటుంది. 2023లో పెద్ద ఈవెంట్లు ఏమీ లేకపోవడం మహిళల టీ20 కప్‌ను ఆ సంవత్సరానికి మార్చాం" అని ఐసీసీ తెలిపింది.