తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐసీసీ సరికొత్త అవార్డు రేసులో పంత్, రూట్‌ - ఐసీసీ ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​ పంత్​ రూట్​

ఈ నెలకుగానూ 'ఐసీసీ ప్లేయర్​ ఆఫ్​ ది మంత్'​ అవార్డుకు పంత్(టీమ్​ఇండియా)​, జో రూట్​(ఇంగ్లాండ్​), స్టిర్లింగ్​(ఐర్లాండ్​) నామినేట్​ అయ్యారు. మహిళా క్రికెటర్లలో దియానా బైగ్​(పాకిస్థాన్), శభ్నిమ్​ ఇస్మయిల్​, మరిజన్నె కప్(దక్షిణాఫ్రికా) రేసులో ఉన్నారు.

icc
ఐసీసీ

By

Published : Feb 2, 2021, 4:01 PM IST

జనవరి నెలకుగానూ 'ప్లేయర్ ఆఫ్ ది మంత్‌' అవార్డుకు నామినేట్ అయిన క్రికెటర్ల జాబితాను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ప్రకటించింది. ఇందులో టీమ్​ఇండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌, ఇంగ్లాండ్​ సారథి జో రూట్, ఐర్లాండ్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్‌ ఉన్నారు.

ఇటీవల ఆసీస్​పై జరిగిన సిరీస్​లో రెండు టెస్టులు ఆడిన పంత్​.. సిడ్నీ టెస్టులో 97, గబ్బాలో 89 పరుగులు చేసి విజయంలో కీలకంగా వ్యవహరించాడు. శ్రీలంకపై టెస్టు సిరీస్​ను 2-0 తేడాతో కైవసం చేసుకోవడంలో ఇంగ్లాండ్​ సారథి జో రూట్​(228,186) కీలక పాత్ర పోషించాడు. యూఏఈ, అఫ్గానిస్థాన్​తో జరిగిన వన్డే సిరీస్​లో మూడు సెంచరీలు బాది అందరి దృష్టిని ఆకర్షించాడు ఐర్లాండ్​ ఆటగాడు స్టిర్లింగ్​. ఈ అద్భుత ప్రదర్శన కారణంగానే వీరిని ఎంపిక చేసినట్లు తెలిపింది ఐసీసీ.

మహిళా క్రికెటర్స్​లో దియానా బైగ్​(పాకిస్థాన్), శభ్నిమ్ ఇస్మయిల్​, మరిజన్నె కప్(ఇద్దరు దక్షిణాఫ్రికా) ఈ రేసులో ఉన్నారు. ​​ వీరిలో బైగ్ వన్డేల్లో 13.22 ఎకానమీతో 9 వికెట్లు తీయగా.. ఇస్మాయిల్ 4.57 ఎకానమీతో టీ20ల్లో 7 వికెట్లు పడగొట్టింది. మరిజన్నె వన్డేల్లో 115 బంతుల్లో 115 పరుగులు చేసింది. వీరిలో విజేతను ఓటింగ్​ ద్వారా ప్రకటిస్తారు.

అంతర్జాతీయ క్రికెట్​లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు ప్రతినెలా 'ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌' అవార్డును ఇవ్వాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఇటీవల నిర్ణయించింది. ఏడాది పొడవునా అన్ని ఫార్మాట్లలో పురుషులు, మహిళా క్రికెటర్ల ఉత్తమ ప్రదర్శనల గుర్తించేందుకు ఈ అవార్డులను ఇవ్వనున్నట్లు తెలపింది. దీనిలో భాగంగానే జనవరి నెలకుగానూ 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డుల నామినీలను ప్రకటించింది.

ఇదీ చూడండి: ఉత్తమ క్రికెటర్లకు ఇక ప్రతి నెలా ఐసీసీ అవార్డులు

ABOUT THE AUTHOR

...view details