తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐసీసీ 'ప్లేయర్​ ఆఫ్ ది మంత్​' రేసులో అశ్విన్​, రూట్​ - జో రూట్ వార్తలు

ఫిబ్రవరి నెలకుగానూ 'ఐసీసీ ప్లేయర్​ ఆఫ్​ ది మంత్'​ అవార్డుకు రవిచంద్రన్​ అశ్విన్​(టీమ్​ఇండియా)​, జో రూట్​(ఇంగ్లాండ్​), ​కైలీ మేయర్స్​(వెస్టిండీస్​​) నామినేట్​ అయ్యారు. మహిళా క్రికెటర్లలో టామీ బ్యూమాంట్​(ఇంగ్లాండ్​), బ్రూక్ హాలిడే(ఆస్ట్రేలియా), నాట్ సైవర్(ఇంగ్లాండ్​) రేసులో ఉన్నారు.

ICC 'Player of the Month': Ashwin, Root, Mayers in contention among men
ఐసీసీ 'ప్లేయర్​ ఆఫ్ ది మంత్​' రేసులో అశ్విన్​, రూట్​

By

Published : Mar 2, 2021, 4:01 PM IST

Updated : Mar 2, 2021, 4:12 PM IST

క్రికెట్​లో ఫిబ్రవరి నెలకు గానూ 'ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​' అవార్డుకు నామినేట్​ అయిన ఆటగాళ్ల జాబితాను అంతర్జాతీయ క్రికెట్​ మండలి (ఐసీసీ) ప్రకటించింది. పురుషుల క్రికెటర్లలో టీమ్​ఇండియా స్పిన్నర్​ రవిచంద్రన్​ అశ్విన్​, ఇంగ్లాండ్​ కెప్టెన్​ జో రూట్, వెస్టిండీస్​ బ్యాట్స్​మన్​ కైలీ మేయర్స్​ ఉన్నారు.

ఇంగ్లాండ్​పై టెస్టు సిరీస్​లో అద్భుతంగా రాణిస్తున్నాడు అశ్విన్​. ఇప్పటివరకు జరిగిన 3 టెస్టుల్లో 176 పరుగులు చేయటం సహా 24 వికెట్లు పడగొట్టాడు. చెపాక్​ వేదికగా జరిగిన రెండో టెస్టులో సెంచరీతో టీమ్ఇండియా విజయానికి బాటలు వేశాడు.

భారత్​తో తొలి టెస్టులో ద్విశతకం(218) సాధించాడు రూట్​. అహ్మదాబాద్​ వేదికగా జరిగిన పింక్​-టెస్టులో 5 వికెట్లు పడగొట్టాడు. ఈ సిరీస్​లో ఇప్పటివరకు జరిగిన మూడు టెస్టుల్లో రూట్​.. 333 రన్స్​ చేసి, 6 వికెట్లను సాధించాడు.

మరోవైపు మేయర్స్​ అరంగేట్రంలోనే టెస్టు నాలుగో ఇన్నింగ్స్​లో 210 పరుగులతో అజేయంగా నిలిచి.. బంగ్లాపై చారిత్రక విజయాన్నందించాడు.

మరోవైపు మహిళా క్రికెటర్ల జాబితాలో టామీ బ్యూమాంట్​(ఇంగ్లాండ్​), బ్రూక్ హాలిడే(ఆస్ట్రేలియా), నాట్ సైవర్(ఇంగ్లాండ్​) 'ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​'కు పోటీ పడనున్నారు.

ఈ అవార్డు ఎందుకు?

అంతర్జాతీయ క్రికెట్​లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు ప్రతినెలా 'ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌' అవార్డును ఇవ్వాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) జనవరిలో నిర్ణయించింది. ఏడాది పొడవునా అన్ని ఫార్మాట్లలో పురుషులు, మహిళా క్రికెటర్ల ఉత్తమ ప్రదర్శనల గుర్తించేందుకు ఈ అవార్డులను ఇవ్వనున్నట్లు తెలపింది. దీనిలో భాగంగానే జనవరి నెలకుగానూ 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్'గా టీమ్ఇండియా యువ క్రికెటర్​ రిషబ్​ పంత్​ ఎంపికయ్యాడు.

ఇదీ చూడండి:ఐసీసీ ర్యాంకింగ్స్​: ఆరుకు పడిపోయిన మంధాన, మిథాలీ@9

Last Updated : Mar 2, 2021, 4:12 PM IST

ABOUT THE AUTHOR

...view details