ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి విడుదల చేసింది. బ్యాట్స్ఉమెన్ జాబితాలో సౌతాఫ్రికా ఓపెనర్ లిజెల్లీ లీ ఏడు స్థానాలు మెరుగుపరుచుకుని అగ్ర స్థానానికి చేరింది. భారత్‌తో జరుగుతోన్న సిరీస్‌లో రాణిస్తున్న లీ.. కెరీర్లో రెండో సారి అత్యుత్తమ ర్యాంక్ దక్కించుకుంది. ఇంగ్లాండ్ క్రీడాకారిణి టామీ బ్యూమాంట్ రెండో స్థానానికి పడిపోయింది.
ఇండియా ఓపెనర్ పూనమ్ రౌత్ కూడా 8 స్థానాలు మెరుగుపరుచుకుని.. 18వ స్థానాన్ని దక్కించుకుంది. టాప్-10లో భారత్ తరఫున స్మృతి మంథాన 7, మిథాలీ రాజ్ 9 స్థానాలలో కొనసాగుతున్నారు.