తెలంగాణ

telangana

ETV Bharat / sports

ర్యాంకింగ్స్​ :టాప్​లో కోహ్లీ.. ఆర్చర్ 18 స్థానాలు పైకి

ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్​లో కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా, జడేజా.. అవే స్థానాల్లో కొనసాగుతున్నారు. బౌలర్ల విభాగంలో జోఫ్రా ఆర్చర్, ఏకంగా 18 స్థానాలు ఎగబాకి టాప్-10లో చోటు దక్కించుకోవడం విశేషం.

ICC
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్​

By

Published : Sep 17, 2020, 3:38 PM IST

వన్డే తాజా ర్యాంకింగ్స్​ను అంతర్జాతీయ క్రికెట్​ మండలి (ఐసీసీ) గురువారం విడుదల చేసింది. బ్యాట్స్​మెన్ జాబితాలో టీమ్​ఇండియా కెప్టెన్​ కోహ్లీ, రోహిత్​ శర్మ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా.. బౌలింగ్​ విభాగం​లో బుమ్రా రెండులోనే ఉన్నాడు. ఆల్​రౌడండర్ల జాబితాలో రవీంద్ర జడేజా ఎనిమిదో స్థానంలో నిలిచాడు.

టాప్​ బ్యాట్స్​మెన్

871 పాయింట్లతో కోహ్లీ అగ్రస్థానంలో, 855 పాయింట్లతో రోహిత్​ శర్మ రెండో స్థానంలో, 829 పాయింట్లతో పాకిస్థాన్ క్రికెటర్ బాబర్​ అజమ్​ మూడో స్థానంలో ఉన్నారు. మూడుస్థానాలు మెరుగుపర్చుకున్న ఇంగ్లాండ్ బ్యాట్స్​మన్ బెయిర్​స్టో(10).. టాప్-10లో చోటు దక్కించుకున్నాడు.

టాప్​ బౌలర్స్​

బౌలర్ల జాబితాలో న్యూజిలాండ్​కు చెందిన పేసర్​ ట్రెంట్​ బౌల్డ్​ 722 పాయింట్లతో అగ్రస్థానంలో.. 719 పాయింట్లతో బుమ్రా రెండులో కొనసాగుతున్నారు. మూడు స్థానాలు మెరుగుపర్చుకున్న క్రిస్ వోక్స్ నాలుగులో, ఏడు స్థానాలు మెరుగుపర్చుకున్న జోష్ హేజిల్​వుడ్ ఎనిమిదో స్ధానంలో నిలిచాడు. ఇంగ్లాండ్​ యువ బౌలర్ జోఫ్రా ఆర్చర్​ అయితే ఏకంగా 18 స్థానాలు ఎగబాకి, స్టార్క్​తో కలిసి పదో స్థానాన్ని పంచుకున్నాడు.

ఆల్​రౌండర్లు

ఆల్​రౌండర్స్​ టాప్​-10లో ఉన్న ఏకైక భారతీయుడు రవీంద్ర జడేజా. ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. మహ్మద్​ నబీ(అఫ్గాన్) అగ్రస్థానంలో.. మూడు స్థానాలు ఎగబాకిన వోక్స్ రెండులోకి వచ్చాడు. రెండు స్థానాలు దిగజారిన బెన్ స్టోక్స్.. నాలుగుకు పడిపోయాడు.

ఇదీ చూడండి రోహిత్ రాణిస్తే ముంబయిదే టైటిల్: బ్రెట్​లీ

ABOUT THE AUTHOR

...view details