తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీ20 ప్రపంచకప్​ 2022కు వాయిదా! - అంతర్జతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)

ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరగాల్సిన టీ20 ప్రపంచకప్​ను 2022కు వాయిదా వేయనున్నారు. మే 28న జరిగే ఐసీసీ సమావేశంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.

ICC likely to postpone 2020 T20 World Cup tomorrow, open window for IPL
2022కు టీ20 ప్రపంచకప్​ వాయిదా.. రేపే ప్రకటన!

By

Published : May 27, 2020, 12:40 PM IST

Updated : May 27, 2020, 12:47 PM IST

ఆస్ట్రేలియాలో ఈ ఏడాది ఆక్టోబ‌ర్‌లో జ‌ర‌గాల్సిన టీ20 ప్రంపచక‌ప్ వాయిదా ప‌డే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏకంగా 2022లో జరపబోతున్నారని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న ఏదీ లేదు. కానీ ఆ టోర్నీని వాయిదా వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్న‌ట్లు అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి వ‌ర్గాల చెబుతున్నాయి. మే 28న జరిగే ఐసీసీ సమావేశంలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశముంది.

క‌రోనా నేప‌థ్యంలో అన్ని రకాల క్రీడా టోర్నీలు ర‌ద్దు అవుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఆగ‌స్టులో జ‌ర‌గాల్సిన ఒలింపిక్స్‌నూ వాయిదా వేశారు. ఈ నేపథ్యంలోనే టీ20 ప్రపంచక‌ప్‌ను 2022లో భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం కొత్త షెడ్యూల్‌ను త‌యారు చేస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. వాస్త‌వానికి 2021లో ఇండియాలో టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌ర‌గాల్సి ఉంది. అయితే ఆ టోర్నీని య‌థావిధిగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జ‌ర‌గాల్సిన టోర్నీని మాత్రం 2022కు వాయిదా వేసినట్లు సమాచారం.

ఒక‌వేళ క‌రోనా వైర‌స్ ఉధృతి త‌గ్గితే.. సెప్టెంబరు-అక్టోబ‌ర్‌‌లో భార‌త్‌ వేదికగా ఐపీఎల్ నిర్వ‌హించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు బీసీసీఐ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది.

ఇదీ చూడండి...'కోహ్లీ, నేను మంచి స్నేహితుల్లా ఉండేవాళ్లం'

Last Updated : May 27, 2020, 12:47 PM IST

ABOUT THE AUTHOR

...view details