తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్​: టాప్​లో స్మిత్​, కమిన్స్​ - ashes 2019

ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్​లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు అగ్రస్థానాలు కైవసం చేసుకున్నారు. బ్యాటింగ్​ విభాగంలో స్టీవ్​ స్మిత్ తొలిస్థానంలో నిలిచాడు. భారత జట్టు సారథి కోహ్లీ రెండో స్థానంలో ఉన్నాడు. బౌలింగ్​లో ఆసీస్​ పేసర్ కమిన్స్​ తొలి ర్యాంకులో, బుమ్రా మూడో స్థానంలో ఉన్నారు.

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్​: టాప్​లో స్మిత్​, కమిన్స్​

By

Published : Sep 10, 2019, 3:24 PM IST

Updated : Sep 30, 2019, 3:22 AM IST

యాషెస్​ నాలుగో టెస్టు తర్వాత టెస్టు ర్యాంకింగ్స్​ ప్రకటించిందిఐసీసీ. ఆసీస్​ స్టార్​ బ్యాట్స్​మెన్​ స్టీవ్​ స్మిత్​ తొలిస్థానం సంపాదించుకున్నాడు. మాంచెస్టర్​ వేదికగా జరిగిన యాషెస్​ నాలుగో టెస్టులో 185 పరుగుల తేడాతో విజయం సాధించింది ఆస్ట్రేలియా. ఈ మ్యాచ్​ విజయంలో కీలకపాత్ర పోషించాడు స్మిత్​. రెండు ఇన్నింగ్స్​ల్లో 211, 82 పరుగులతో రాణించిన ఈ క్రికెటర్​​.. ప్రస్తుతం 937 పాయింట్లతో ఉన్నాడు.

టీమిండియా సారథి కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. వీరిద్దరి మధ్య 34 పాయింట్ల అంతరం ఉంది. జాస్​ బట్లర్​ (37), రోరీ బర్న్స్​(61), ఇంగ్లాండ్​ కెప్టెన్​ టిమ్​ పైన్ ​(60) ర్యాంకులు మెరుగుపర్చుకున్నారు.

కమిన్స్ టాపర్​​...

ఆసీస్​ బౌలర్​ పాట్​ కమిన్స్ బౌలింగ్​ విభాగంలో​ మొదటి స్థానం కైవసం చేసుకున్నాడు. యాషెస్​ నాలుగో టెస్టులో 103 పరుగులిచ్చి 7 వికెట్లు తీశాడు. ఫలితంగా కెరీర్​లో అత్యుత్తమంగా 914 పాయింట్లతో నిలిచాడు. ఈ గణాంకాలతో ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్​ మెక్​గ్రాత్​ సరసన చోటు దక్కించుకున్నాడు.దక్షిణాఫ్రికా పేసర్ రబాడ రెండవ ర్యాంక్​లో ఉన్నాడు. బుమ్రా మూడో స్థానంలోకొనసాగుతున్నాడు. ఆసీస్ బౌలర్ హెజిల్​వుడ్ (10) టాప్​-10లో చోటు సంపాదించాడు.

బంగ్లాదేశ్​తో జరిగినఏకైక టెస్టులో 224 పరుగుల తేడాతో విజయం సాధించింది అఫ్గాన్​ జట్టు. ఫలితంగా ఆ దేశ ఆటగాళ్ల ర్యాంకులూ మెరుగుపడ్డాయి. కెప్టెన్​ రషీద్​ ఖాన్​(37), మాజీ సారథి ఆస్గర్​ అఫ్గాన్​ (63), రహ్మత్​ షా(65) స్థానాలు సంపాదించారు. టెస్టులకు రిటైర్మెంట్​ ప్రకటించిన అఫ్గానిస్థాన్​ ఆల్​రౌండర్​​ నబీ (85), బంగ్లా ఆల్​రౌండర్​ షకిబుల్ హసన్(21) స్థానాల్లో ఉన్నారు.

ఇదీ చదవండి...

Last Updated : Sep 30, 2019, 3:22 AM IST

ABOUT THE AUTHOR

...view details