తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఉత్తమ క్రికెటర్లకు ఇక ప్రతి నెలా ఐసీసీ అవార్డులు - ఐసీసీ న్యూ అవార్డ్స్​

ప్రతిభ ఉన్న ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు ఐసీసీ కొత్త అవార్డులను పరిచయం చేయనుంది. 'ఐసీసీ ప్లేయర్​ ఆఫ్​ ది మంత్' పేరిట ఈ పురస్కారాన్ని అందజేయనుంది. భారత్​ నుంచి జనవరి నెలకు గానూ సిరాజ్​, పంత్​, నటరాజన్​, వాషింగ్టన్​ సుందర్​ రేసులో ఉన్నారు.

icc
ఐసీసీ

By

Published : Jan 27, 2021, 12:40 PM IST

Updated : Jan 27, 2021, 1:05 PM IST

అంతర్జాతీయ క్రికెట్​లోని అన్ని ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శన చేసిన మహిళ, పురుష క్రికెటర్లను గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు మరో కొత్త అవార్డును పరిచయం చేయనుంది ఐసీసీ. ఇకపై ప్రతి నెలలో ఆటలో బాగా రాణించిన ఆటగాళ్లకు 'ఐసీసీ ప్లేయర్​ ఆఫ్​ ది మంత్'​ పేరుతో అవార్డులను అందించనుంది. పురుష క్రికెటర్లకు ఐసీసీ మెన్స్​ ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​, మహిళా క్రికెటర్లకు ఐసీసీ ఉమెన్​ ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​ పేరుతో ఈ పురస్కారాలను ఇవ్వనుంది.

భారత్​ నుంచి నలుగురు..

ఆస్ట్రేలియాపై రికార్డు సిరీస్​ విజయం సాధించిన టీమ్​ఇండియా నుంచి నలుగురు ఆటగాళ్లు జనవరి నెలకుగానూ నామినేట్​ అయ్యారు. పంత్​, సిరాజ్​లతో పాటు వాషింగ్టన్​ సుందర్​, నటరాజన్​ ఈ జాబితాలో ఉన్నారు. ఇంకా స్టీవ్​ స్మిత్​(ఆసీస్​), జో రూట్​(ఇంగ్లాండ్​), రెహ్మానుల్లా గుర్బాజ్​(అఫ్గానిస్థాన్​), మరిజానే కాప్​, డిక్లర్క్​(సౌతాఫ్రికా), నీదా దార్​(పాకిస్థాన్​) కూడా రేసులో ఉన్నారు.

ఓటింగ్​ ద్వారా

ఐసీసీ ముందుగా.. ఈ అవార్డులకు నామినేట్​ అయిన ఆటగాళ్ల పేర్లను ప్రకటిస్తుంది. అభిమానులు తమకిష్టమైన క్రికెటర్​కు ఓటు వేయొచ్చు. నామినేట్​ అయిన ఆటగాళ్లలో అత్యధిక ఓటింగ్​ అందుకున్న క్రీడాకారులు విజేతలుగా నిలిచి.. పురస్కారాలు సొంతం చేసుకుంటారు. ప్రతి నెలా రెండో సోమవారం ఈ అవార్డులను ప్రకటించనుంది ఐసీసీ.

Last Updated : Jan 27, 2021, 1:05 PM IST

ABOUT THE AUTHOR

...view details