తెలంగాణ

telangana

ETV Bharat / sports

'డక్​వర్త్ లూయిస్' సృష్టికర్త టోనీకి ఐసీసీ నివాళి

'డక్​వర్త్ లూయిస్' విధానం సృష్టికర్తల్లో ఒకరైన టోనీ లూయిస్ మృతిపై విచారం వ్యక్తం చేసింది ఐసీసీ. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది.

'డక్​వర్త్ లూయిస్' సృష్టికర్త టోనీకి ఐసీసీ నివాళి
టోనీ లూయిస్

By

Published : Apr 2, 2020, 4:07 PM IST

'డక్​వర్త్ లూయిస్' విధానం సృష్టికర్తల్లో ఒకరైన టోనీ లూయిస్.. బుధవారం(ఏప్రిల్ 1), 78 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. ఈ విషయమై విచారం వ్యక్తం చేసింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. క్రికెట్​కు టోనీ అందించిన సహకారం మరవలేనిదని, ఏళ్ల పాటు గుర్తుంటుందని ఐసీసీ జనరల్ మేనేజర్ జెఫ్ అల్లార్​డైస్ అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

షెఫీల్డ్​ విశ్వవిద్యాలయంలోని గణిత, గణాంక శాస్త్రాల్లో పట్టా పొందిన లూయిస్.. ఫ్రాంకిన్ డక్​వర్త్​తో కలిసి ఈ విధానాన్ని రూపొందించారు. దీనిని 1999 నుంచి క్రికెట్​లో అమలు పరుస్తోంది ఐసీసీ. అంతర్జాతీయ మ్యాచ్​ జరుగుతున్నప్పుడు వర్షం పడితే.. ఈ విధానంలో లెక్కగట్టి, ప్రత్యర్థికి లక్ష్యాన్ని నిర్దేశిస్తారు. అన్ని ఫార్మాట్లలో ఇది ప్రస్తుతం అమల్లో ఉంది.

ABOUT THE AUTHOR

...view details