తెలంగాణ

telangana

ETV Bharat / sports

'నిరుద్యోగులకు ఉచితంగా ఆహారం అందిస్తా'

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది నిరుద్యోగులుగా మిగిలారు. పాకిస్థాన్​లో ఉన్న నిరుద్యోగులకు తన వంతు సహాయాన్ని చేస్తున్నాడు ఆ దేశానికి చెందిన​ మాజీ అంపైర్​ అలీమ్​ దార్​. లాహోర్​లోని తన రెస్టారెంట్​లో వారికి ఉచితంగా ఆహారం అందిస్తున్నాడు.

ICC Elite Panel umpire Dar offers free food for jobless at his Lahore restaurant
'నిరుద్యోగులకు ఉచితంగా ఆహారాన్ని అందిస్తా'

By

Published : Mar 28, 2020, 6:15 AM IST

ప్రపంచమంతా కరోనా వైరస్​ బారిన పడిన నేపథ్యంలో అనేక మంది ప్రజలు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఈ క్రమంలో నిరుద్యోగులందరికి ఉచితంగా ఆహారం అందించేందుకు పాకిస్థాన్​కు చెందిన​ మాజీ అంపైర్​ అలీమ్​ దార్​ ముందుకొచ్చాడు.

"కరోనా వైరస్ ప్రపంచమంతటా వ్యాపించిన సమయంలో చాలా మంది నిరుద్యోగులుగా మారారు. లాహోర్​లోని పియా రోడ్‌ డార్స్ డిలైటో అనే రెస్టారెంట్ నాకు ఉంది. నిరుద్యోగులు అక్కడకు వచ్చి ఉచితంగా ఆహారం తినవచ్చు. ఈ వైరస్​ ప్రభావం ప్రస్తుతం పాకిస్థాన్‌లోనూ కనిపిస్తుంది."

- అలీమ్​ దార్​, పాక్​ మాజీ అంపైర్​

అలీమ్​ దార్​.. తన కెరీర్​ మొత్తంలో 400 అంతర్జాతీయ మ్యాచ్​లకు అంపైర్​గా వ్యవహరించాడు. మరోవైపు పాకిస్థాన్​ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది.. తన ఛారిటీ ఫౌండేషన్ ద్వారా విస్తృతమైన సహాయక చర్యలను నిర్వహిస్తున్నాడు.

పాకిస్థాన్​లో ఇప్పటికే వేయి మందికి పైగా ఈ మహమ్మారి సోకింది. దీంతో అక్కడి ప్రభుత్వం తాజాగా లాక్​డౌన్​ ప్రకటించింది.

ఇదీ చూడండి.. ఆ ఒక్క ఇన్నింగ్స్​ సచిన్ కెరీర్​ను మార్చింది​

ABOUT THE AUTHOR

...view details