తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీ20 ప్రపంచకప్ వాయిదాపై వస్తోన్న వార్తలు అవాస్తవం! - టీ20 ప్రపంచకప్ వాయిదా లేదు

టీ20 ప్రపంచకప్ వాయిదా పడబోతుందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తెలిపింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. శశాంక్ మనోహర్ ఐసీసీ ఛైర్మన్ పదవి పొడగింపును కోరుకోవట్లేదని స్పష్టం చేసింది.

ఐసీసీ
ఐసీసీ

By

Published : May 28, 2020, 5:47 AM IST

Updated : May 28, 2020, 6:57 AM IST

కొన్ని రోజులుగా టీ20 ప్రపంచకప్ వాయిదా పడుతుందనే వార్తలు వస్తున్నాయి. తాజాగా దీనిపై వివరణ ఇచ్చింది ఐసీసీ. ఆ వార్తల్లో వాస్తవం లేదని తెలిపింది. కచ్చితంగా ఈ ఏడాదే టోర్నీని జరపడానికి ప్రయత్నిస్తామని స్పష్టం చేసింది. అలాగే ఐసీసీ ఛైర్మన్​ శశాంక్ మనోహర్ పదవీ కాలంపైనా స్పష్టతనిచ్చింది.

"ఇంకా ఐసీసీ ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ మనోహర్ పదవీ కాలం పొడగింపును కోరుకోవట్లేదు. తదుపరి ఐసీసీ ఛైర్మన్ ఎన్నికపై బోర్డుకు మద్దతుగా నిలుస్తానని చెప్పారు. అలాగే టీ20 ప్రపంచకప్ వాయిదా పడుతుందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. కరోనా మహమ్మారి దృష్ట్యా టోర్నీ నిర్వహణపై చర్చిస్తున్నాం."

-ఐసీసీ

అక్టోబర్-నవంబర్​లో టీ20 ప్రపంచకప్ జరగాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఈ టోర్నీ జరిగే వీలులేదని పలు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో ఐపీఎల్​ను నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహకాలు చేస్తుందని కూడా సమాచారం.

Last Updated : May 28, 2020, 6:57 AM IST

ABOUT THE AUTHOR

...view details