తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐసీసీ ఛైర్మన్‌ ఎంపికపై కుదరని ఏకాభిప్రాయం

ఐసీసీ కొత్త ఛైర్మన్​ ఎవరన్నదానిపై ఇంకా సందిగ్ధం కొనసాగుతోంది. నామినేషన్​ ప్రక్రియ విషయంలోనే బోర్డు సభ్యులు ఏకాభిప్రాయానికి రాలేకపోవడం వల్ల చర్చల్లో పురోగతి కనిపించలేదు. ఈ పదవి కోసం కోలిన్​ గ్రేవ్స్​, డేవ్​ కామెరాన్​, ఇమ్రాన్​ ఖవాజా తదితరులు రేసులో ఉన్నారు.

icc chairman latest news
ఐసీసీ ఛైర్మన్‌ ఎంపికపై కుదరని ఏకాభిప్రాయం

By

Published : Aug 11, 2020, 9:12 AM IST

Updated : Aug 11, 2020, 2:33 PM IST

ఐసీసీ తర్వాతి ఛైర్మన్‌పై ఏకాభిప్రాయం సాధించడంలో సోమవారం(ఆగస్టు 10న) ఐసీసీ బోర్డు సభ్యులు విఫలమయ్యారు. ఛైర్మన్‌ నామినేషన్‌ పక్రియను ఖరారు చేయడమే ఎజెండాగా వర్చువల్‌గా సమావేశమైన ఐసీసీ.. ఎలాంటి పురోగతి సాధించలేకపోయింది.

"ఐసీసీలో చాలా అంశాలపై ఏకాభిప్రాయం లేని మాట నిజమే. ఛైర్మన్‌ ఎన్నికకు సాధారణ మెజారిటీ ఉండాలా లేదా ఇప్పుడున్నట్లే మూడింట రెండొంతుల మెజారిటీ ఉండాలన్న విషయంపై భిన్నాభిప్రాయలు వ్యక్తమయ్యాయి" అని ఓ బీసీసీఐ అధికారి చెప్పాడు.

ప్రస్తుతానికైతే ఛైర్మన్‌ పదవికి పోటీపడాలనుకుంటున్న వారెవరిపైనా ఏకాభిప్రాయం లేదు. అయితే ఎన్నిక అయినా లేదా ఏకగ్రీవమైనా మొత్తం ప్రక్రియ నాలుగు వారాల్లో ముగుస్తుందని భావిస్తున్నారు.

ఎన్నిక ఎలా..?

సాధారణంగా ఐసీసీ ఛైర్మన్‌కు మూడింట రెండొంతుల ఆధిక్యం అవసరం. ఐసీసీ బోర్డులో ప్రస్తుతం మొత్తం సభ్యుల సంఖ్య 17. పన్నెండు టెస్టు దేశాలతో పాటు అనుబంధ దేశాలు (మలేసియా, స్కాట్లాండ్‌, సింగపూర్‌), ఛైర్మన్‌ (ప్రసుత్తం తాత్కాలిక ఛైర్మన్‌), ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌ (ఇంద్ర నూయి)లకు ఓటింగ్‌ హక్కులు ఉన్నాయి. ఐసీసీ ముఖ్య కార్యనిర్వహణ అధికారి మను సాహ్నీ కూడా బోర్డులో సభ్యుడే. కానీ అతడికి ఓటు హక్కు లేదు.

గంగూలీపైనే అందరి దృష్టి..!

ఐసీసీ ఛైర్మన్‌ పదవికి పోటీ పడాలంటే కనీసం రెండు శాశ్వత సభ్య దేశాల మద్దతు ఉండాలి. ఇప్పటి వరకైతే ఐసీసీ ఛైర్మన్‌పై ఏకాభిప్రాయం రాలేదు. ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు మాజీ ఛైర్మన్‌ కోలిన్‌ గ్రేవ్స్‌.. శశాంక్‌ మనోహర్‌ స్థానాన్ని భర్తీ చేసే రేసులో ముందున్నాడు. క్రికెట్‌ వెస్టిండీస్‌ మాజీ అధిపతి డేవ్‌ కామెరాన్‌, ఐసీసీ తాత్కాలిక ఛైర్మన్‌ ఇమ్రాన్‌ ఖవాజా (సింగపూర్‌) కూడా ఆసక్తిగా ఉన్నారు. అయితే అందరి కళ్లూ బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ వైపే. బీసీసీఐ అతణ్ని ఐసీసీకి పంపాలనుకుంటుందా లేదా అన్నది ఆసక్తికరం.

తప్పనిసరి విరామ నిబంధన ప్రకారం గంగూలీ పదవీకాలం ముగిసింది. ఆ నిబంధనను తొలగించాలంటూ బీసీసీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈ నెల 17న విచారించనుంది. 48 ఏళ్ల గంగూలీ బీసీసీఐని వదిలేయాల్సి వస్తే.. అతణ్ని ఐసీసీకి పంపడానికి బోర్డుకు అభ్యంతరమేమీ ఉండకపోవచ్చు.

Last Updated : Aug 11, 2020, 2:33 PM IST

ABOUT THE AUTHOR

...view details