గుజరాత్ అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో ఏర్పాటు చేసిన 'నమస్తే ట్రంప్' కార్యక్రమానికి కుటుంబ సమతేంగా హాజరయ్యారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ సందర్బంగా వివిధ అంశాలపై మాట్లాడిన ఆయన.. దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్, టీమిండియా సారథి విరాట్ కోహ్లీ గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా సచిన్ పేరును సోచిన్ అని తప్పుగా పలికారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
"మీరు అభిమానించే దిగ్గజ క్రికెటర్లు సో...చిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లీ ప్రపంచమంతా గర్వపడే ఆటగాళ్లు."