టీ20 ప్రపంచకప్ నిర్వహణకు సంబంధించిన తుది నిర్ణయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) జులైకు వాయిదా వేసింది. కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న క్రమంలో జులై వరకు వేచి ఉండి అప్పటి పరిస్థితులను బట్టి టోర్నీ ప్రణాళికపై ఆలోచిస్తామని తెలిపింది.
"టీ20 ప్రపంచకప్ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకోవడానికి మరికొంత సమయం కావాలి. మేము మా సభ్యులు, ప్రసారకర్తలు, భాగస్వాములు, ప్రభుత్వాలు, ఆటగాళ్లతో సంప్రదించి.. మంచి వార్తతో మీ ముందుంటాం".