ఐసీసీ ప్రకటించిన దశాబ్దపు ఉత్తమ జట్లలో పాకిస్థాన్‌కు చెందిన ఒక్క ఆటగాడు కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. దీనిపై ట్విట్టర్లో ట్రోల్స్ వర్షం కురుస్తోంది. పలువురు పాక్ మాజీలు ఐసీసీ తీరుపై మండిపడుతున్నారు. వారు ప్రకటించింది ప్రపంచ టీ20 జట్టా? లేక ఐపీఎల్ టీ20 జట్టా? అంటూ ప్రశ్నిస్తున్నారు. తాజాగా పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కూడా ఐసీసీ తీరును తప్పుబట్టాడు.
"నాకు తెలిసి పాకిస్థాన్ కూడా అంతర్జాతీయ క్రికెట్ మండలిలో సభ్య దేశం అని ఐసీసీ మరిచిపోయినట్లుంది. టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న బాబర్ అజామ్‌ను జట్టులో ఎంపికచేయలేదు. పాక్ జట్టు నుంచి అసలు ఒక్క ఆటగాడిని కూడా తీసుకోలేదు. మాకు ప్రపంచ టీ20 జట్టు అవసరం లేదు. ఎందుకంటే మీరు ఐపీఎల్ టీ20 జట్టును ప్రకటించారు. డబ్బు, స్పాన్సర్షిప్, టీవీ హక్కుల గురించే ఐసీసీ ఆలోచిస్తోంది. క్రికెట్‌ను పూర్తిగా వాణిజ్యాంశంగా తయారు చేసింది."
-అక్తర్, పాక్ మాజీ పేసర్
ఐసీసీ విడుదల చేసిన వన్డే, టీ20, టెస్టు జట్టలో ఎందులోనూ పాక్ ఆటగాళ్లకు చోటు దక్కలేదు. దీంతో నెటిజన్లు ట్రోల్స్ చేస్తుండగా, పాక్ మాజీలు మాత్రం ఐసీసీపై విరుచుకుపడుతున్నారు.
దశాబ్దపు ఉత్తమ టీ20 జట్టు