తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఎల్బీ నిబంధనల్లో మార్పు రావాలి' - ఆసీస్​ మాజీ కెప్టెన్​ ఇయాన్​ ఛాపెల్

ఎల్బీ నిబంధనల్లో విప్లవాత్మక మార్పులు రావాలన్నాడు ఆస్ట్రేలియా​ మాజీ కెప్టెన్​ ఇయాన్​ చాపెల్​. బంతి లైన్‌లో లేకపోయినా.. స్టంప్స్‌ను తాకుతుందని అంపైర్‌ భావిస్తే ఎల్బీగా ఔటివ్వాలని సూచించాడు.

Ian Chappell wants to Change LBW Laws For Better Cricket
'ఎల్బీ నిబంధనల్లో మార్పు రావాలి'

By

Published : May 11, 2020, 10:04 AM IST

పిచ్‌పై బంతి ఎక్కడ పడినా.. లైన్‌లో లేకపోయినా.. స్టంప్స్‌ను తాకుతుందని అంపైర్‌ భావిస్తే ఎల్బీగా ఔటివ్వాలని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ చాపెల్‌ సూచించాడు. ఎల్బీ నిబంధనల్లో విప్లవాత్మక మార్పులు రావాలని అభిప్రాయపడ్డాడు.

"కొత్త ఎల్బీ నిబంధన కచ్చితంగా ఉండాలి. పిచ్‌పై బంతి ఎక్కడ పడినా.. ఆఫ్‌స్టంప్‌ ఆవల ప్యాడ్‌ను తాకినా.. లైన్‌లో లేకపోయినా.. స్టంప్స్‌ తాకుతుందని అంపైర్‌కు అనిపిస్తే బ్యాట్స్​మన్​ను ఎల్బీగా ప్రకటించాలి. దీని వల్ల ఆటలో న్యాయం జరుగుతుంది. బౌలర్‌ స్టంప్స్‌పైకి బంతులు సంధిస్తుంటే బ్యాట్స్‌మన్‌ తన వికెట్‌ కాపాడుకోవడానికి బ్యాటునే ఉపయోగించాలి. గాయాలు కాకుండా ఉండేందుకే ప్యాడ్లు. ఔట్‌ను తప్పించుకోవడానికి కాదు" అని చాపెల్‌ తెలిపాడు.

ఇదీ చూడండి..'క్రికెట్​లో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు'

ABOUT THE AUTHOR

...view details