బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు తొలిసారిగా ఎంపికయ్యాడు శివమ్ దూబే. హార్దిక్ పాండ్య గాయంతో జట్టులోకి వచ్చిన ఇతడు హార్దిక్ స్థానాన్ని భర్తీ చేస్తాడని చాలామంది భావించారు. అయితే ఈ విషయమై స్పష్టత ఇచ్చాడు దూబే. పాండ్య స్థానాన్ని భర్తీ చేయడానికి రాలేదని అన్నాడు.
"హార్దిక్ స్థానాన్ని భర్తీ చేయడానికి రాలేదు. దేశం తరఫున పోరాడటానికి వచ్చా. నాకు చక్కని అవకాశం లభించింది. గొప్పగా ఆడటానికి కృషి చేస్తా. జట్టు సభ్యులంతా ప్రోత్సహిస్తున్నారు. సారథి, జట్టు యాజమాన్యం అండగా నిలుస్తూ నాలో ఆత్మవిశ్వాసం నింపుతున్నారు. డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రశాంతగా, ఆనందంగా ఉన్నాను. ఆల్‌రౌండర్‌గా రాణించాలంటే ఫిట్‌నెస్ ఎంతో ముఖ్యం. బ్యాటింగ్, బౌలింగ్ చేయాలంటే మంచి ఫిట్‌నెస్ ఉండాలి. అది సాధించడం ఎంతో కష్టతరం. నా బౌలింగ్ పట్ల నమ్మకం ఉంది. టీ20ల్లో ప్రతి బౌలర్‌కి మంచి, చెడు మ్యాచులు ఉంటాయి. నాణ్యమైన బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకుని నాలుగు ఓవర్లు వేయాలని సన్నద్ధమవుతున్నా. పొట్టి ఫార్మాట్‌లో వెస్టిండీస్ పటిష్ఠ జట్టు, కానీ సిరీస్ గెలిచేది టీమిండియానే."
-శివమ్ దూబే, టీమిండియా యువ క్రికెటర్