క్రికెట్ నుంచి తాను రిటైర్మెంట్ తీసుకునేంత వరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీకే ఆడాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు ఆల్‌రౌండర్ ఆండ్రూ రసెల్. ఈ జట్టు ట్విట్టర్లో నిర్వహించిన లైవ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని పంచుకున్నాడు.
'క్రికెట్లో చివరిక్షణం వరకు ఆ ఫ్రాంచైజీతోనే ఉంటా' - RUSSELL NEWS
కెరీర్లో తను ఆడే చివరి మ్యాచ్ వరకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌తోనే ఉంటానని తన మనసులోని మాటను బయటపెట్టాడు ఆల్‌రౌండర్ రసెల్.
"ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్, ఎన్బీఏ లీగ్‌లోని ఆటగాళ్ల తరహాలో నేను, ఐపీఎల్లో కేకేఆర్‌కు ఆడాలనుకుంటున్నా. ఆరేళ్ల నుంచి ఈ ఫ్రాంచైజీతో ఉంటూ ప్రతిక్షణాన్ని ఆస్వాదిస్తున్నా. జట్టు కోసం టైటిల్ కొట్టాలన్నదే నా లక్ష్యం. టోర్నీ జరిగితే ఈ ఏడాది విజేతగా నిలుస్తామని భావిస్తున్నా" -ఆండ్రూ రసెల్, కోల్‌కతా ఆల్‌రౌండర్
32 ఏళ్ల రసెల్.. కోల్‌కతాకు ఒంటిచేత్తో ఎన్నో విజయాల్ని అందించాడు. అందుకే అతడిని అభిమానించే వారు ఎక్కువమంది ఉంటారు. గత సీజన్లోనూ 14 మ్యాచ్‌లాడి 510 పరుగులు చేశాడు. కేకేఆర్ తరఫున అత్యధిక పరుగులు చేసిన వాడిగా నిలిచాడు.