కొంతకాలంగా దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ రీఎంట్రీపై వార్తలు వస్తున్నాయి. కోచ్ బౌచర్.. ఏబీకి మద్దతుగా ఉండటం వల్ల త్వరలోనే డివిలియర్స్ మళ్లీ బ్యాట్ పడతాడని అంతా భావించారు. కానీ ఇటీవల బౌచర్ మాట్లాడుతూ ఫామ్‌లో ఉంటేనే అవకాశం కల్పిస్తామని అన్నాడు. ఈ మాటలు మిస్టర్ 360ని నొప్పించినట్టున్నాయి. తాజాగా ఈ విషయంపై మాట్లాడిన ఏబీ ఫిట్‌గా ఉంటేనే ఆడతానని అన్నాడు.
"ఒకవేళ టీ20 ప్రపంచకప్ వాయిదాపడితే రీఎంట్రీపై ఆలోచన చేయాల్సిందే. అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. ఇప్పుడైతే నేను ఫిట్‌గా ఉన్నాను. కానీ వచ్చే ఏడాది ఇలానే ఉంటానని చెప్పలేను. ఇప్పుడే ఈ విషయంపై కచ్చితమైన నమ్మకాన్ని ఇవ్వలేను."