తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రపంచకప్ గెల్చుకున్న తర్వాతే నా పెళ్లి: రషీద్ - Rashid Khan marriage news

తమ దేశ జట్టు ప్రపంచకప్ గెల్చుకున్న తర్వాతే వివాహం చేసుకుంటానని అఫ్గాన్​ బౌలర్ రషీద్​ఖాన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్ కొత్త సీజన్​ కోసం ఎదురుచూస్తున్నానని అన్నాడు.

'ప్రపంచకప్ గెల్చుకున్న తర్వాతే నా పెళ్లి'
అఫ్గాన్​ బౌలర్ రషీద్​ఖాన్

By

Published : Jul 12, 2020, 5:01 PM IST

అఫ్గానిస్థాన్​ తరఫున అద్భుత ప్రదర్శన చేస్తున్న స్పిన్నర్ రషీద్​ఖాన్.. తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ దేశ జట్టు ప్రపంచకప్​ గెల్చుకున్న తర్వాతే వివాహం చేసుకుంటానని అన్నాడు. అజాది రేడియో​తో ఇటీవలే జరిగిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడు.

ప్రస్తుతం ఐసీసీ బౌలింగ్​ ర్యాంకింగ్స్​లో అగ్రస్థానంలో ఉన్న రషీద్​ఖాన్.. చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాడు. దేశం తరఫునే కాకుండా ఐపీఎల్​తో పాటు పలు దేశాల్లోని లీగుల్లో ఆడుతూ పేరు సంపాదించాడు. కెరీర్​లో 7 టెస్టులు, 67 వన్డేలు, 48 టీ20లు ఆడిన రషీద్​ఖాన్.. అన్ని ఫార్మాట్లలో కలిపి 200కు పైగా వికెట్లు తీశాడు.

అఫ్గాన్​ బౌలర్ రషీద్​ఖాన్

ఐపీఎల్​ కోసం ఎదురుచూస్తున్నా

అయితే కరోనా ప్రభావంతో నిరవధిక వాయిదా పడిన ఐపీఎల్​ 13వ సీజన్​ కోసం చాలా ఎదురుచూస్తున్నట్లు రషీద్​ఖాన్ తెలిపాడు. ఈ టోర్నీలోని గత మూడు సీజన్లలో సన్​రైజర్స్ హైదరాబాద్​కు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తంగా 46 మ్యాచ్​లాడి 55 వికెట్లు దక్కించుకున్నాడు.

ABOUT THE AUTHOR

...view details