తెలంగాణ

telangana

ETV Bharat / sports

అప్పుడు ధోని ఆడితే నేను ఆడతా: ఏబీ

మిస్టర్ 360 డివిలియర్స్.. ఇటీవల ఓ ఇంటర్​వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2023 ప్రపంచకప్​లో ధోని ఆడితే కచ్చితంగా తానూ ఆడతానని చెప్పాడు ఏబీ.

By

Published : May 18, 2019, 2:41 PM IST

అప్పుడు ధోని ఆడితే నేను ఆడతా: డివిలియర్స్

టీమిండియా మాజీ కెప్టెన్ ధోని క్రేజ్​ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్వదేశంలోనే కాకుండా విదేశీ క్రికెటర్లలోనూ అతడికి అభిమానులు ఉన్నారు. ఇటీవలే ఓ ఇంటర్​వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు దక్షిణాఫ్రికా ఆటగాడు డివిలియర్స్. 2023లో ప్రపంచకప్​లో ఆడతారా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘ధోని అప్పటికీ ఆడుతూ ఉంటే కచ్చితంగా నేనూ ఆడతాను’ అని చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇంటర్​వ్యూలో డివిలియర్స్

2019లో వరల్డ్‌కప్‌లో ఆడాలని ఉన్నా పరిస్థితులు అనుకూలించక వీడ్కోలు చెప్పాల్సి వచ్చిందని తెలిపాడు డివిలియర్స్. 2018 మే నెలలో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలిగాడు. ప్రస్తుతం ఐపీఎల్‌ వంటి విదేశీ లీగ్‌ల్లో మాత్రమే ఆడుతున్నాడు.

ఇది చదవండి: ప్రపంచకప్​ ఆడేందుకు జాదవ్ సిద్ధం

ABOUT THE AUTHOR

...view details