తెలంగాణ

telangana

ETV Bharat / sports

వార్న్ ఫ్రెండైతే.. ఆసీస్ స్లెడ్జింగ్ చేయదు: కుంబ్లే - వార్న్ ఫ్రెండైతే.. ఆసీస్ స్లెడ్జింగ్ చేయదు: కుంబ్లే

షేన్ వార్న్ తన స్నేహితుడు కావడం వల్ల ఆసీస్ జట్టు స్లెడ్జింగ్ చేయలేదని చెప్పాడు టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే. ఆస్ట్రేలియా జట్టుకు బౌలింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తానని అన్నాడు.

i was a friend of warne.. ausis didn't sledging says kumble
అనిల్ కుంబ్లే

By

Published : Nov 27, 2019, 6:10 AM IST

స్లెడ్జింగ్​(ప్రత్యర్థి క్రికెటర్లను రెచ్చగొట్టేలా మాట్లాడటం) విషయంలో ఇతర దేశాలతో పోలిస్తే ఆస్ట్రేలియా క్రికెటర్లు ముందుంటారు. ప్రత్యర్థి ఆటగాళ్లను రెచ్చగొట్టేలా మాట్లాడి, మ్యాచ్​లో ఫలితం పొందుదామని చూస్తుంటారు. అయితే అనిల్ కుంబ్లేను వాళ్లు స్లెడ్జింగ్ చేయలేదట. అందుకు కారణం ఆసీస్ మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ తన స్నేహితుడు కావడమేనని ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో కుంబ్లే చెప్పాడు.

"మీకు షేన్ వార్న్ మిత్రుడైతే.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు మిమ్మల్ని స్లెడ్జింగ్ చేయరు. వార్న్.. నేనూ మంచి స్నేహితులం. కాబట్టి నన్ను ఎవరూ రెచ్చగొట్టేలా ప్రవర్తించలేదు" -అనిల్ కుంబ్లే, భారత మాజీ క్రికెటర్.

ఆస్ట్రేలియా జట్టుకు బౌలింగ్ చేయడాన్ని తను ఆస్వాదిస్తానని అన్నాడు కుంబ్లే.

"బౌలర్​గా ప్రతి ఒక్కరికీ బౌలింగ్ చేయాలి. కానీ ఆస్ట్రేలియా జట్టుకు బౌలింగ్ చేయడం ఛాలెంజింగ్​గా ఉంటుంది. ఆ రోజుల్లో అంతర్జాతీయ క్రికెట్​లో వారిది అత్యుత్తమ జట్టు. ఆసీస్​పై సత్తాచాటితే గర్వంగా అనిపిస్తుంది. వారికి బౌలింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తా. చాలా సార్లు అత్యుత్తమ ప్రదర్శన చేశా " - అనిల్ కుంబ్లే, భారత మాజీ క్రికెటర్.

132 టెస్టులాడిన అనిల్ కుంబ్లే.. 619 వికెట్లు తీశాడు. 2008లో ఆస్ట్రేలియాతో చివరి టెస్టు మ్యాచ్ ఆడి రిటైర్మెంట్ ప్రకటించాడు.

ఇదీ చదవండి: గేల్ ఫన్నీ అప్పీల్.. అంపైర్ ముసి ముసి నవ్వుల్..!

ABOUT THE AUTHOR

...view details