ఆంటిగ్వాలోని రిచర్డ్స్ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో... భారత్ 318 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌ల్లో 81, 102 పరుగులతో ఆకట్టుకున్నాడు రహానే. గెలుపు అనంతరం మాట్లాడిన టెస్టు వైస్ కెప్టెన్... తనపై విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా ఆడేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు.
"విమర్శలు సాధారణం. వాటిని ఆపటం సాధ్యం కాదు. అయితే వాటిని పట్టించుకోకుండా ఆడేందుకు ప్రయత్నిస్తా. సెంచరీ చేసినపుడు మాత్రం చాలా ఆనందంగా అనిపిస్తుంది. నేను సాధించాల్సింది చాలా ఉంది. శతకం కన్నా జట్టును మంచి స్థితిలో ఉంచటమే ముఖ్యం".
-- రహానే, క్రికెటర్