తెలంగాణ

telangana

ETV Bharat / sports

'మంధానను కాపీ కొట్టినా.. వర్కౌట్​ అవ్వలేదు' - రియాన్​ పరాగ్​ బ్యాటింగ్​ స్టైల్​

బ్యాటింగ్​లో పలువురు క్రీడాకారులను అనుసరించినా వర్కౌట్​ కాలేందుటున్నాడు యువ క్రికెటర్​ రియాన్​ పరాగ్​. గతేడాది ఐపీఎల్​లో అరంగేట్రం చేసిన రియాన్​.. రాజస్థాన్​ రాయల్స్​కు ప్రాతినిధ్యం వహించి బ్యాటింగ్​లో మంచి ప్రతిభ కనబర్చాడు. అయితే తనలో కొంతమంది సీనియర్​ ఆటగాళ్లు స్ఫూర్తిని నింపారని తాజాగా వెల్లడించాడు.

I tried smriti mandhana style but it didn't workout: Riyan parag
'మంధానను కాపీ కొట్టినా.. వర్కౌట్​ అవ్వలేదు'

By

Published : Apr 25, 2020, 7:48 AM IST

గతేడాది ఐపీఎల్​ అరంగేట్రం చేసి ఉత్తమ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు రాజస్థాన్​ రాయల్స్​ ఆటగాడు రియాన్​ పరాగ్​. బెన్​ స్ట్రోక్స్​, స్టీవ్​ స్మిత్​లు చెప్పిన మెలకువలతో భయపడకుండా ఆడానని తెలిపాడు. అస్సోంకు చెందిన రియాన్​ కోల్​కతా నైట్​రైడర్స్​తో జరిగిన మ్యాచ్​లో 31 బంతుల్లో 47 పరుగులు సాధించి వార్తల్లో నిలిచాడు. గతేడాది ఈ టోర్నీలో 7 మ్యాచ్​లకు ప్రాతినిధ్యం వహించి 130 స్ట్రైక్​రేట్​తో 160 పరుగులు సాధించాడు.

"ఐపీఎల్​లో​ రాజస్థాన్​ రాయల్స్​ జట్టులో స్థానం లభించటం చాలా ఆనందంగా ఉంది. నేను తొలిసారి బ్యాట్​ పట్టుకొని మైదానంలో అడుగుపెట్టినప్పుడు యంఎస్​ ధోని కీపింగ్​ చేయటం చాలా ఆనందాన్ని కలిగించింది. ధోని, కోహ్లీ, జోస్​ బట్లర్​ లాంటి పెద్దపెద్ద వారితో ఆడటం నాకు దక్కిన గౌరవంగా భావిస్తాను."

-- రియాన్​ పరాగ్​, రాజస్థాన్​ రాయల్స్​ ఆటగాడు

మరోవైపు తన బ్యాటింగ్​ శైలి ద్వారా పలువురు బ్యాటర్లను అనుకరించే ప్రయత్నం చేశానని పరాగ్​ తాజాగా వెల్లడించాడు. వారిలో ప్రధానంగా భారత మహిళా క్రికెటర్​ స్మృతి మంధాన, టీమ్​ఇండియా వైస్​ కెప్టెన్​ రోహిత్ ఆటతీరును అనుకరించినా.. అది వర్కౌట్​ కాలేదని తెలిపాడు. చివరికి అండర్​-19 ప్రపంచకప్​లో విరాట్​ కోహ్లీని అనుసరించి బ్యాటింగ్​లో రాణించానని తెలిపాడు. ప్రస్తుతం తన సొంత బ్యాటింగ్​శైలిపై దృష్టి పెడుతున్నట్టు వెల్లడించాడు.

ఇదీ చూడండి..'ఐపీఎల్​ కోసం ఆసియాకప్​ వాయిదా వేస్తే సహించం'

ABOUT THE AUTHOR

...view details