తెలంగాణ

telangana

ETV Bharat / sports

నాకు కరోనా వచ్చినట్లుంది: ఇంగ్లాండ్ బౌలర్ - జాక్​ లీచ్​కు కరోనా లక్షణాలు

తనకు కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని అనుమానం వ్యక్తం చేశాడు ఇంగ్లీష్​ స్పిన్నర్​ జాక్​ లీచ్​. త్వరలో వెస్టిండీస్​తో టెస్టు సిరీస్​ సిద్ధమవుతున్న ఇతడు.. ప్రస్తుతం క్వారంటైన్​లో ఉన్నాడు.

jack leach
జాక్​లీచ్​

By

Published : Jun 28, 2020, 1:24 PM IST

తనకు కరోనా సోకిందేమోనని అనుమానంగా ఉన్నట్లు ఇంగ్లాండ్​ స్పిన్నర్​ జాక్​​లీచ్ చెప్పాడు. వైరస్​ సంబంధించిన లక్షణాలు కనిపిస్తున్నాయని అన్నాడు. గతంలో దక్షిణాఫ్రికాలో పర్యటించినప్పుడే ఈ వైరస్ సోకి ఉండొచ్చని వెల్లడించాడు.​

ఇప్పటికే లీచ్.. ఫ్లూ, క్రోన్​ వంటి వ్యాధులతో బాధపడుతున్నాడు. వీటివల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గి వైరస్​ సోకే ప్రమాదం ఉంది.

వచ్చే నెలలో స్వదేశంలో వెస్టిండీస్​తో జరగబోయే టెస్టు సిరీస్​ కోసం సిద్ధమవుతున్నాడు. దీనిని బయో సెక్యూర్​ వాతవారణంలో నిర్వహించనున్నారు. ఇందుకోసం జాక్​లీచ్ క్వారంటైన్​లో ఉన్నాడు. ఇతడితో పాటు మరో 29 మంది క్రికెటర్లు స్వీయనిర్భంధంలోనే ఉన్నారు.

ఇది చూడండి : 'ఆరేళ్లలో ధోనీ కెప్టెన్సీలో చాలా మార్పులు'

ABOUT THE AUTHOR

...view details