తెలంగాణ

telangana

ETV Bharat / sports

'నాలుగో స్థానాన్ని నేను చేజిక్కించుకున్నట్లే' - బ్యాటింగ్​ ఆర్డర్​లో నాలుగో స్థానం శ్రేయస్​ అయ్యర్

బ్యాటింగ్​ ఆర్డర్​లో నాలుగో స్థానాన్ని చేజిక్కించుకున్నట్లేనన్నాడు టీమిండియా యువ ఆటగాడు శ్రేయస్​ అయ్యర్​. దీంతో పాటే మైదానంలో కోహ్లీ.. సింహంలా చాలా ఉత్సాహంగా కదులుతాడని కితాబిచ్చాడు.

shreyas ayyar
శ్రేయస్​ అయ్యర్

By

Published : Jun 9, 2020, 7:00 AM IST

బ్యాటింగ్‌ ఆర్డర్‌లో నాలుగో స్థానాన్ని పదిలపరుచుకున్నట్లేనని భారత యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ అన్నాడు. "భారత్‌ తరఫున ఏడాదిగా ఒక స్థానంలో స్థిరంగా ఆడుతున్నామంటే ఆ స్థానాన్ని చేజిక్కించుకున్నట్లే. దాని గురించి ఇంకా ప్రశ్నించాల్సిన అవసరం లేదు. నంబర్‌-4 గురించి చర్చ నడిచినప్పుడు ఆ స్థానంలో దిగి నన్ను నేను నిరూపించుకోవడం సంతృప్తిగా అనిపిస్తోంది. కానీ టీమ్‌ ఇండియాకు ఆడుతున్నప్పుడు బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఎక్కడైనా బ్యాటింగ్‌ చేసే సరళత ఉండాలి. పరిస్థితిని బట్టి ఏ స్థానంలోనైనా ఆడగలను." అని శ్రేయస్‌ చెప్పాడు.

సారథి కోహ్లీపై అతను ప్రశంసలు కురిపించాడు. "సహచరులకు ప్రోత్సాహం అందించడంలో కెప్టెన్‌ కోహ్లి ముందుంటాడు. యువ ఆటగాళ్లందరికి అతనే మార్గదర్శి. విరాట్‌ మైదానంలో సింహంలా చాలా ఉత్సాహంగా కదులుతాడు. ఫీల్డ్‌లోకి వస్తున్నప్పుడు అతని శరీర భాషే చాలా భిన్నంగా ఉంటుంది" అని అన్నాడు.

ఇది చూడండి : ఆ అలవాటును తగ్గించే ప్రయత్నంలో కుల్దీప్

ABOUT THE AUTHOR

...view details