తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆ క్షణం కన్నీరు ఆపుకోలేకపోయా: చాహల్

ప్రపంచకప్​ సెమీస్​లో ఒకానొక సందర్భంలో కన్నీటిని ఆపుకోలేకపోయానని చెప్పాడు టీమిండియా బౌలర్​ యుజువేంద్ర చాహల్. అందుకు గల కారణాన్ని వెల్లడించాడు.

యజ్వేంద్ర చాహల్,భారత బౌలర్

By

Published : Sep 29, 2019, 5:35 AM IST

Updated : Oct 2, 2019, 10:10 AM IST

ఈ ఏడాది జరిగిన ప్రపంచకప్​లో టీమిండియా సెమీస్​ దాటలేకపోయింది. న్యూజిలాండ్​ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే ఆ మ్యాచ్​ను గుర్తు చేసుకున్న భారత స్పిన్నర్​ చాహల్.. తీవ్ర ఉద్వేగానికి గురయ్యాడు. మహీ భాయ్ ఔటైన సందర్భంలో కన్నీళ్లు ఆపుకోలేకపోయానని అన్నాడు.

"ఇది నా తొలి ప్రపంచకప్​. కివీస్​తో మ్యాచ్​లో ధోనీ ఔటైన తర్వాత నేను బ్యాటింగ్​కు వెళ్లా. ఆ సమయంలో కన్నీరు ఆపుకోలేకపోయాను. ఆ సందర్భం నాకు చాలా బాధ కలిగించింది. టోర్నీ ఆసాంతం బాగా ఆడి.... సెమీస్​లో టోర్నీ నుంచి నిష్క్రమించాం"-యుజువేంద్ర చాహల్,భారత బౌలర్

ఆ మ్యాచ్​లో 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 18 పరుగుల తేడాతో ఓడిపోయింది టీమిండియా. జడేజాతో కలిసి 116 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ధోని.. 49 ఓవరలో రనౌట్​గా వెనుదిరిగాడు. అప్పటి వరకు విజయానికి చేరువలో ఉన్న కోహ్లీసేన.. మ్యాచ్​పై పట్టు కోల్పోయి ఓటమిపాలైంది.

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీతో చాహల్

ఆ టోర్నీ అనంతరం టీమిండియా తరఫున కేవలం ఒకే ఒక్క వన్డే ఆడాడు చాహల్. టీ20లకు అతడిని ఎంపిక చేయట్లేదు.

ఇది చదవండి: జడేజా, ధోనీ వీరోచిత ఇన్నింగ్స్​ వృథా... ప్రపంచకప్​ ఫైనల్లో కివీస్​

Last Updated : Oct 2, 2019, 10:10 AM IST

ABOUT THE AUTHOR

...view details