టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్‌పై క్రికెట్లో నిషేధం అనేక విధాలుగా పూర్తయింది. 2000లో మ్యాచ్ ఫిక్సింగ్‌లో పాల్గొన్న కారణంగా అజారుద్దీన్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) జీవితకాలం పాటు నిషేధించింది. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత అజారుద్దీన్.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆశ్రయించాడు. ఈ విషయంపై విచారణ చేసిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం.. 2012లో దీన్ని చట్టవిరుద్ధమని పేర్కొంది. ఈ విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు అజారుద్దీన్.
"నాపై నిషేధం విధించడానికి గల కారణాలు నాకే తెలియవు. కానీ, దానిపై పోరాడాలని నిర్ణయించుకున్నా. 12 ఏళ్లపాటు పోరాడిన తర్వాత ఆ సమస్యకు పరిష్కారం దొరికినందుకు సంతోషం. హైదరాబాద్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత నేను వెళ్లి బీసీసీఐ ఏజీఎం సమావేశానికి హాజరైనప్పుడు చాలా సంతృప్తిగా అనిపించింది. పదేళ్ల పాటు టీమ్ఇండియాకు కెప్టెన్‌గా ఉండటం నా అదృష్టం"