తెలంగాణ

telangana

ETV Bharat / sports

'టెస్టు క్రికెట్​కు గుడ్​బై చెప్పడానికి అదే కారణం ' - cricket latest news

పాకిస్థాన్ పేసర్​ వాహబ్​ రియాజ్​ టెస్టులకు గుడ్​బై చెప్పడానికి గల కారణాలను తెలిపాడు. సెలెక్టర్లు తనపై నిర్లక్ష్యంగా వ్యవహించడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశాడు.

I quit Test cricket after being ignored for 2 years, says Wahab Riaz
వాహబ్​ రియాజ్

By

Published : Jun 9, 2020, 1:36 PM IST

పాకిస్థాన్​ లెఫ్టార్మ్​ ఫాస్ట్​ బౌలర్​ వాహబ్​ రియాజ్​ టెస్టు​లకు గుడ్​బై చెప్పడానికి గల కారణాలను వెల్లడించాడు. జాతీయ సెలక్టర్లు తనపై పదేపదే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందు వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశాడు. 2018 అక్టోబర్ నుంచి పాకిస్థాన్​ టెస్టు జట్టుకు తనను ఎంపిక చేయలేదని వాహబ్​ గుర్తు చేశాడు.

"నేను 2017, అక్టోబరులో టెస్టు మ్యాచ్​ ఆడాను. ఏడాది తర్వాత ఆస్ట్రేలియాతో ఫ్లాట్​ పిచ్​పై ఆడే మరో అవకాశం వచ్చింది. అనంతరం నన్ను మరోసారి ఏడాదికి పైగా తొలగించారు.

-వాహబ్​ రియాజ్​, పాక్​ క్రికెటర్​

అందుకే తొలగింపు..

2010లో ఇంగ్లాండ్​లో జరిగిన టెస్టు మ్యాచ్​తో అరంగేట్రం చేసిన వాహబ్​తో పాటు, తోటి పేసర్​ మహ్మద్ ఆమిర్​ను సెంట్రల్​ కాంట్రాక్ట్​ లిస్ట్​ నుంచి పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు (పీసీబీ) తొలగించింది. పాక్​కు అవసరమైన సమయంలో టెస్టు మ్యాచ్​కు గుడ్​బై చెప్పడం వల్లే ఇరువురిపై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

తాజాగా టీ20, వన్డేలపై దృష్టి పెడితే మంచిదని భావిస్తున్నట్లు వాహబ్​ తెలిపాడు. తనకు సెంట్రల్​ కాంట్రాక్ట్​ పొందడం కంటే పాక్​ తరఫున ఆడటమే ముఖ్యమని స్పష్టం చేశాడు.

మొహాలీ వేదికగా 2011 ప్రపంచ కప్​లో భాగంగా భారత్​తో జరిగిన​ సెమీఫైనల్​లో 5 వికెట్లు తీశాడు వాహబ్​. అప్పటి నుంచి క్రికెట్​ అభిమానులకు సపరిచితమయ్యాడు. వాహబ్​ 27టెస్టులు, 89 వన్డేలు, 31 టీ20 మ్యాచ్​లు ఆడి.. మొత్తం 228 వికెట్లు తీశాడు. ​

ABOUT THE AUTHOR

...view details