టీమ్ఇండియాతో జరిగిన తొలిటెస్టు రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా ఓపెనర్ జో బర్న్స్.. అర్ధశతకంతో అలరించాడు. తాజాగా అదే మ్యాచ్లో భారత ఓపెనర్ పృథ్వీషా వైఫల్యంపై స్పందించాడు బర్న్స్. భారత ఓపెనర్ పృథ్వీషా బ్యాటింగ్లో నిలకడ కోసం పోరాడుతున్నా.. తన ప్రత్యర్థి జట్టు కాబట్టి తాను ఎలాంటి సలహా ఇవ్వలేనని అన్నాడు.
"నేను అతడి ప్రత్యర్థి జట్టులో ఆడుతున్న కారణంగా అతడికి ఎటువంటి సలహా ఇవ్వను. అతను ఈ సిరీస్లో పరుగులేమీ చేయలేడని నేను ఆశిస్తున్నా. అతడు ఫామ్లో ఉన్నాడో లేదో నాకు తెలియదు. కానీ, నేను అతడిని అనుసరించను. టీమ్ఇండియా తరపున ఆడుతున్నాడు కాబట్టి.. అతను నాణ్యమైన ఆటగాడే. సిరీస్ పూర్తైన తర్వాత అతడికి సలహా ఇస్తా. మధ్యలో నేను ఎలాంటి సూచనలు ఇవ్వలేను".