తెలంగాణ

telangana

ETV Bharat / sports

'అప్పుడు కల నిజమైన అనుభూతి కలిగింది' - సంజు శాంసన్ తాజా వార్తలు

ఐపీఎల్​లో రాజస్థాన్​ జట్టు తరఫున ద్రవిడ్​ ఆడతావా అని అడిగినప్పుడు కల నిజమైన అనుభూతి కలిగిందని, జీవితంలో ఎదురైన ఆటుపోట్ల వల్ల ధోనీ లాంటి స్వభావం అలవడిందని చెప్పాడు యువ క్రికెటర్ సంజు శాంసన్.

'అప్పుడు కల నిజమైన అనుభూతి కలిగింది'
సంజు శాంసన్

By

Published : May 6, 2020, 3:10 PM IST

Updated : May 6, 2020, 3:33 PM IST

దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ తనను జట్టులో ఆడతావా అని అడిగినప్పుడు కల నిజమైన అనుభూతి కలిగిందని యువ క్రికెటర్‌ సంజు శాంసన్‌ అన్నాడు. వీరిద్దరూ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌కు కలిసి ఆడారు.

'రాహుల్‌ భాయ్‌, జుబిన్‌ భారుచ (ప్రాంఛైజీ చీఫ్‌) రాజస్థాన్‌ రాయల్స్‌కు ట్రయల్స్‌ నిర్వహించారు. అప్పుడు నేను చక్కని ఇన్నింగ్స్‌ ఆడాను. రెండో రోజు ముగిశాక రాహుల్‌ భాయ్‌ నా వద్దకొచ్చాడు. తన జట్టులో ఆడతావా అని అడిగాడు. నాకు కల నిజమైందన్న అనుభూతి కలిగింది' -సంజు శాంసన్‌, యువ క్రికెటర్

జీవితంలో ఎదుర్కొన్న ఆటుపోట్లతో మహేంద్రసింగ్‌ ధోనీలా ప్రశాంత స్వభావం అలవడిందని సంజూ అంటున్నాడు.

'నా బలాలపై ఎక్కువ దృష్టి పెట్టి వైఫల్యాలను అంగీకరించాలని నేను గ్రహించాను. జట్టు ప్రయోజనాల కోసమే ఆడతాను. బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు ధోనీలా భావోద్వేగాలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తాను' -సంజు శాంసన్‌, యువ క్రికెటర్

టీమిండియాకు మళ్లీ ఎంపికవ్వడం గొప్పగా అనిపించిందని శాంసన్‌ వెల్లడించాడు. విరాట్‌ భాయ్‌, రోహిత్‌ భాయ్‌లాంటి ఆటగాళ్ల మధ్య ఉండటం అద్భుతమైన అనుభవంగా పేర్కొన్నాడు. న్యూజిలాండ్‌ మ్యాచుల్లో తనపై విశ్వాసంతో సూపర్‌ ఓవర్లో పంపించినందుకు ధన్యవాదాలు తెలిపాడు. తననో మ్యాచ్‌ విజేతగా వారు భావించారని వెల్లడించాడు.

Last Updated : May 6, 2020, 3:33 PM IST

ABOUT THE AUTHOR

...view details