తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఓడిపోయినా జట్టుపై నమ్మకం ఉంది: హర్మన్

మహిళా టీ20 ప్రపంచకప్​ ఫైనల్​లో భారత జట్టు తప్పిదాలతో ట్రోఫీని చేజార్చుకుంది. ఈ విషయంపై టీమిండియా కెప్టెన్​ హర్మన్​ప్రీత్​ కౌర్​ స్పందించింది. భవిష్యత్​లో జట్టు బాగా రాణిస్తుందన్న నమ్మకం ఈ టోర్నీ ద్వారా నిరూపితమైందని ఆమె తెలిపింది.

I have full faith in my team, India skipper Harmapreet Kaur
'ఓడిపోయినా జట్టుపై నాకు నమ్మకం ఉంది'

By

Published : Mar 8, 2020, 9:08 PM IST

మహిళా టీ20 ప్రపంచకప్​ ఫైనల్​ మ్యాచ్​లో ఆస్ట్రేలియాపై భారత్​ ఘోరపరాజయం చవిచూసింది. ఫీల్డింగ్​లో తీవ్రమైన తప్పిదాలు చేసింది టీమిండియా. కీలక బ్యాటర్​ల క్యాచ్​లు మిస్​ చేసిన కారణంగా భారీ మూల్యం చెల్లించుకుంది. మ్యాచ్ అనంతరం జట్టు వైఫల్యాలపై భారత కెప్టెన్​ హర్మన్​ప్రీత్​ కౌర్​ స్పందించింది.

"టీ20 ప్రపంచకప్​ లీగ్​ దశలోని అన్ని మ్యాచ్​లలో అత్యుత్తమ ప్రదర్శన చేశాం. కానీ, ఫైనల్​లో ఓటమి ఎదురైంది. అయినా, జట్టుపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఫీల్డింగ్​లో అనుకోని తప్పిదాలు జరిగాయి. అందుకే ఫలితం ఇలా వచ్చింది. ప్రతి ఏడాది జట్టు మెరుగవ్వుతోంది. దానికి ఉదాహరణ ఫైనల్​కు చేరటమే. తర్వాతి టీ20 ప్రపంచకప్​ను కచ్చితంగా సాధిస్తామన్న నమ్మకం ఉంది."

- హర్మన్​ప్రీత్​ కౌర్​, టీమిండియా మహిళా జట్టు కెప్టెన్​

షెఫాలీది చిన్న వయసు

షెఫాలీ, స్పిన్నర్​ రాజేశ్వరి గైక్వాడ్​.. మ్యాచ్​లో రెండు కీలక క్యాచ్​లను జారవిడిచారు. వీరిద్దరి వల్లే జట్టు భారీ మూల్యం చెల్లించుకుందని విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంలో షెఫాలీకి మద్దతుగా నిలిచింది టీమిండియా కెప్టెన్​ హర్మన్​ప్రీత్​. తనదింకా చిన్న వయసే అని.. మొదటి సారి ప్రపంచకప్​ ఆడుతున్న క్రమంలో ఒత్తిడిని ఎదుర్కోలేక పోయిందని తెలిపింది హర్మన్​. ఈ టోర్నీలో జట్టు సాధించిన విజయాల్లో షెఫాలీ పాత్ర కచ్చితంగా ఉందని ఆమె వెల్లడించింది.

ఇదీ చూడండి.. మొన్న రోహిత్.. నిన్న జైస్వాల్.. నేడు షెఫాలీ

ABOUT THE AUTHOR

...view details