తెలంగాణ

telangana

ETV Bharat / sports

'అలా అయితే ధోనీ ఆడటం సందేహమే!' - హర్ష భోగ్లే

ఐపీఎల్​ రద్దైతే ఈ ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్​లో ధోనీ ఆడటం సందేహమే అంటున్నాడు టీవీ వ్యాఖ్యాత హర్ష భోగ్లే. తన ఆటతీరును చూపించి తిరిగి జట్టులోకి వచ్చే మార్గం అదొక్కటేనని అన్నాడు.

I feel Dhoni's India ambitions might be over: Harsha Bhogle
'అలా అయితే ధోని ఆడటం సందేహమే!'

By

Published : Mar 29, 2020, 5:46 AM IST

Updated : Mar 29, 2020, 9:54 AM IST

కరోనా వ్యాప్తి కారణంగా ఐపీఎల్​ 2020 నిర్వాహణను వాయిదా వేసింది బీసీసీఐ. ముందస్తు ప్రణాళిక ప్రకారం మార్చి 29న చెన్నై సూపర్​ కింగ్స్​తో ముంబయి ఇండియన్స్​ జట్టు తలపడాల్సింది. అయితే కరోనా నేపథ్యంలో టోర్నీ ఏప్రిల్​ 15కు వాయిదా పడింది.

ఒకవేళ ఐపీఎల్​ రద్దుచేస్తే ధోనీ భవిష్యత్​ ఏంటి అనేదానిపై స్పందించాడు భారత వ్యాఖ్యాత హర్ష భోగ్లే. ఐపీఎల్​ రద్దయితే టీమిండియా తరపున ధోనీ ఆడే అవకాశం ఉండకపోచ్చని అంటున్నాడు.

"నా అంచనా ప్రకారం ధోనీ భారత జట్టులోకి రావాల్సిన అవాకాశాలన్ని ముగిసిపోయాయి. ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే టీ20 ప్రపంచకప్​లో స్థానం దక్కించుకుంటాడనేది సందేహమే. ఐపీఎల్​లో ఉత్తమ ప్రదర్శనతో జట్టులో తన స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలనేది తన లక్ష్యం."

-- హర్షభోగ్లే, భారత వ్యాఖ్యాత

హర్ష భోగ్లే, యంఎస్​ ధోని

చెన్నై సూపర్​ కింగ్స్​ అభిమానులు తననెందుకు తలైవా అని పిలుస్తారని అడిగినప్పుడు అతడిలోని మృదుస్వభావి కనిపించాడని అన్నాడు హర్షభోగ్లే. అంతటి ప్రేమాభిమానాలు పొందటం తన అదృష్టంగా భావించాడని అతడు వెల్లడించాడన్నాడు.

ఇదీ చూడండి.. ఆటగాళ్లను సింగర్స్​గా మార్చిన కరోనా!

Last Updated : Mar 29, 2020, 9:54 AM IST

ABOUT THE AUTHOR

...view details