ఈ ఏడాది చివర్లోని ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ నేతృత్వంలోని టీమ్ఇండియా తప్పకుండా విజయం సాధిస్తుందని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ధీమా వ్యక్తం చేశాడు. ఇదే విషయంపై అతడితో మాట్లాడినట్లు తెలిపాడు.
"కోహ్లీకి క్రికెట్ ఆడే సామర్థ్యం ఉంది. మరింత బాగా ఆడేందుకు సంసిద్ధంగా ఉండేలా శ్రమించాలని అతడికి సూచించాను. ఆస్ట్రేలియాతో జరగబోయే సిరీస్లో టీమ్ఇండియాను గెలుస్తుందని భావిస్తున్నాను. ఇదే విషయమై అతడితోనూ మాట్లాడాను"
-గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు