తన టెస్టు కెరీర్ ముగిసిందని అన్నాడు ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్. సుదీర్ఘ ఫార్మాట్లో మళ్లీ ఆడటం అసాధ్యంగా కనిపిస్తుందని తాజాగా వెల్లడించాడు. తన రిటైర్మెంట్ కంటే ముందు చివరిసారి టెస్టు సిరీస్ ఆడాలని ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు. 2023లో భారత్ వేదికగా జరగనున్న ప్రపంచకప్ తన క్రికెట్ కెరీర్లో చివరిదని స్పష్టం చేశాడు.
"టెస్టు క్రికెట్ మళ్లీ ఆడతానని నేను అనుకోను. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో యువ ఆటగాళ్లు చాలా మంది రాణిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న జాతీయ జట్టులోనూ అద్భుతమైన ప్రతిభ కలిగిన వారు ఉండటం సహా టాప్-ఆర్డర్ బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. కాబట్టి ఈ పరిస్థితిలోనూ జట్టులో కొనసాగడం అవసరమని నేను అనుకోను".