టీమ్ఇండియాతో జరగబోయే టెస్టు సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టు ఒక్క మ్యాచు కూడా గెలిచే అవకాశం లేదని టీమ్ఇండియా మాజీ ఓపెనర్ గంభీర్ జోస్యం చెప్పాడు. వైట్‌వాష్ అవుతుందని చెప్పాడు. ఇంగ్లీష్ జట్టు పేలవమైన స్పిన్ దళంతో బరిలోకి దిగుతుందని, ఇది భారత జట్టుకు కలిసొచ్చే అవకాశమని వెల్లడించాడు.
ఇంగ్లాండ్ జట్టు స్పిన్ విభాగానికి సారథ్యం వహిస్తున్న మొయిన్ అలీ మినహా మిగతా స్పిన్నర్లెవరూ భారత్‌పై అంతగా ప్రభావం చూపలేరని అన్నాడు. 60 టెస్టుల్లో 181 వికెట్లు సాధించిన అలీ ఒక్కడే కాస్త ప్రభావం చూపగలడని పేర్కొన్నాడు. ఇంగ్లీష్ స్పిన్నర్లు డామ్ బెస్, జాక్ లీచ్‌లను భారత బ్యాట్స్‌మెన్.. అవలీలగా ఎదుర్కొంటారని అన్నాడు.
శ్రీలంకపై 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకున్న ఇంగ్లాండ్ సారథి జో రూట్‌కు ఈ సిరీస్ చేదు అనుభవాల్ని మిగిలిస్తుందని గంభీర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. భారత బౌలర్లు బుమ్రా, అశ్విన్‌లు ఈ సిరీస్‌లో కీలకం కానున్నారని అన్నాడు.