తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీని సచిన్​తో పోల్చడం సరికాదు: రజాక్ - virat Kohli

టీమిండియా సారథి కోహ్లీ ప్రదర్శనపై పాకిస్థాన్ మాజీ ఆల్​రౌండర్ అబ్దుల్ రజాక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సచిన్​కు కోహ్లీకి మధ్య చాలా తేడా ఉందని అన్నాడు.

Abdul Razzaq
రజాక్

By

Published : Dec 5, 2019, 11:20 AM IST

పాకిస్థాన్ మాజీ ఆల్​రౌండర్ అబ్దుల్ రజాక్.. బుమ్రాపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. బుమ్రా ఓ బేబీ బౌలర్ అంటూ అతడు మాట్లాడాడు. ఈ విషయంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగానే.. అతడు కోహ్లీ ప్రదర్శనపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

"1992-2007 మధ్య కాలం క్రికెటర్లతో ఇప్పటి ఆటగాళ్లను పోల్చలేము. టీ20 క్రికెట్​తో ఆట మారిపోయింది. అప్పట్లో బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విషయాలు చాలా లోతుతో కూడుకుని ఉండేవి. కోహ్లీ మంచి ఆటగాడు. స్థిరంగా ప్రదర్శన చేస్తున్నాడు. కానీ సచిన్​ తెందూల్కర్​తో అతడిని పోల్చలేం. వీరిద్దరి మధ్య చాలా తేడా ఉంది."
-అబ్దుల్ రజాక్, పాక్ మాజీ ఆల్​రౌండర్

తాజాగా బుమ్రాపైనా కామెంట్ చేశాడు రజాక్. అతడో 'బేబీ బౌలర్' అని అన్నాడు. మేటి పేసర్లు మెక్​గ్రాత్, వసీమ్ అక్రమ్​తో పోల్చుకుంటే జస్ప్రీత్​ను సులభంగా ఎదుర్కొంటానని చెప్పాడు.

ఇవీ చూడండి.. 'వారితో పోల్చుకుంటే బుమ్రా ఓ బేబీ బౌలర్'

ABOUT THE AUTHOR

...view details