తెలంగాణ

telangana

ETV Bharat / sports

నాకు క్రికెట్ అంటే ఇష్టం లేదు: వార్నర్ - david warner tiktok

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ మరోసారి టిక్​టాక్​తో అలరించాడు. అయితే ఈసారి పాటలతోనో, డైలాగ్​లతో కాదు. క్రికెట్ బ్యాట్ పట్టి సందడి చేశాడు. అభిమానులకు సవాల్ విసిరాడు.

వార్నర్
వార్నర్

By

Published : May 19, 2020, 6:30 AM IST

తెలుగు పాటలకు టిక్​టాక్ చేస్తూ.. ఈ మధ్య కాలంలో నెట్టింట బాగా సందడి చేస్తున్నాడు ఆస్ట్రేలియా క్రికెటర్​ డేవిడ్​ వార్నర్​. తాజాగా మరో వీడియోను షేర్ చేశాడు. ఇప్పటిదాకా పాటలకు స్టెప్పులేసిన వార్నర్ తాజాగా బ్యాట్ పట్టాడు. తనకు ఇష్టమైన షాట్లను ఆడుతూ కనిపించాడు. ఈ షాట్స్​ను మీరూ ట్రై చేయండి అంటూ సవాల్ విసిరాడు."నాకు క్రికెట్ అంటే ఇష్టం కాదు. ప్రేమ" అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు వార్నర్.

ఇటీవల వార్నర్ అల వైకుంఠపురములో చిత్రంలోని 'బుట్టబొమ్మ', 'రాములో రాములా' పాటలతో పాటు పోకిరి, బాహుబలి సినిమాల్లోని డైలాగ్స్​తో అలరించాడు.

ABOUT THE AUTHOR

...view details