ఓ కప్పు కాఫీ తన జీవితాన్ని మార్చేసిందని చెప్పాడు టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య. అందుకే అప్పటి నుంచి కాఫీ బదులుగా గ్రీన్ టీ మాత్రమే తాగుతున్నానని అన్నాడు. భారత క్రికెటర్ దినేశ్ కార్తిక్‌తో ఇటీవలే జరిగిన ఇన్‌స్టా లైవ్‌చాట్‌లో ఈ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు.
"కాఫీ విత్ కరణ్' షోకు వెళ్లి వచ్చిన తర్వాత, కాఫీ తాగడం పూర్తిగా మానేశా. ఇప్పుడు గ్రీన్ టీ మాత్రమే తాగుతున్నా. నా జీవితంలో కాఫీ ఒక్కసారి తాగినందుకే భారీ మూల్యం చెల్లించుకున్నా. స్టార్‌బక్స్ కంటే ఇదే ఖరీదైన కాఫీ అని నేను పందెం కూడా వేస్తా" -హార్దిక్ పాండ్య, భారత క్రికెటర్