స్పిన్నర్ హర్భజన్ సింగ్ చేతిలో తొలిసారి ఔటయ్యాక తన టెక్నిక్‌పై విశ్వాసం కోల్పోయానని ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాట్స్‌మన్ పాంటింగ్ చెప్పాడు. భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 'డీఆర్ఎస్ విత్ అశ్' యూట్యూబ్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడు. గ్రేమ్‌స్మిత్, హర్భజన్ సింగ్, ముత్తయ్య మురళీధరన్లలో ఎవరితో ఆసక్తికరంగా ఉండేది అన్న ప్రశ్నకు.. భారత దిగ్గజ స్పిన్నర్ భజ్జీ అని పాంటింగ్ బదులిచ్చాడు.
"భజ్జీతో ఆడటం బాగుండేది. దాదాపు అన్నిసార్లు తన స్పిన్ మాయాజాలంతో నన్ను బోల్తా కొట్టించేవాడు. టెస్టుల్లో అందరి కన్నా ఎక్కువసార్లు నన్ను ఔట్ చేసింది అతడే. భజ్జీని ఎదుర్కోవడానికి ఎంతో శ్రమపడాల్సి వచ్చేది. భారత్‌తో 2001లో జరిగిన టెస్టు సిరీస్‌లో క్రీజులోకి వచ్చిన ప్రతిసారి హర్భజన్ చేతిలోనే ఔటయ్యాను. అప్పటినుంచి నా టెక్నిక్‌ను నమ్మడం మానేశా"