తెలంగాణ

telangana

ETV Bharat / sports

'నేను ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదు' - retirement

తాను ఇంకా రిటైర్మెంట్​ ప్రకటించలేదని తెలిపాడు విండీస్ ఆటగాడు క్రిస్​ గేల్. బుధవారం భారత్​తో జరిగిన మ్యాచ్​ అతడికి ఆఖరిది అని అందరూ భావించారు.

క్రిస్ గేల్​

By

Published : Aug 15, 2019, 1:55 PM IST

Updated : Sep 27, 2019, 2:25 AM IST

బుధవారం భారత్​తో జరిగిన మూడో వన్డేనే వెస్టిండీస్ విధ్వంసకారుడు క్రిస్​ గేల్​కు ఆఖరు మ్యాచ్​ అని అందరూ అనుకున్నారు. సర్వత్రా ఇదే చర్చనీయాంశమైంది. అయితే తాను ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదని తెలిపాడు గేల్. ఈ విషయాన్ని మ్యాచ్​ అనంతరం ఓ వీడియోలో తెలిపాడు.

"రిటైర్మెంట్​పై నేను ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. ఈ విషయంపై నిర్ణయాన్ని త్వరలో చెబుతాను" -క్రిస్​ గేల్​, విండీస్​ క్రికెటర్​

భారత్​తో జరిగిన మూడో వన్డేలో చెలరేగి ఆడాడు గేల్. 41 బంతుల్లో 72 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. గేల్ సునామీతో విండీస్​ బలమైన ఆరంభం దక్కింది. 12వ ఓవర్లో ఔటైన గేల్ హెల్మెట్​లో బ్యాట్​ను ఉంచి అభివాదం చేస్తూ మైదానాన్ని వీడాడు. 301వ వన్డే ఆడిన గేల్ అందుకు తగినట్టుగానే అదే నంబర్ జెర్సీని ధరించి మ్యాచ్​ ఆడాడు. దీంతో అతడికిదే ఆఖరు మ్యాచ్​ అని అందరూ భావించారు.

క్రిస్ గేల్​

ఈ మ్యాచ్​లో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోహ్లీ(114) శతకంతో చెలరేగగా.. శ్రేయస్ అయ్యర్(65) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. వర్షం కారణంగా డక్​వర్త్​లూయిస్​ విధానంలో ఫలితం తేల్చారు. 2-0 తేడాతో టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది.

ఇది చదవండి: 'దేశ ప్రజలందరికీ పంద్రాగస్టు శుభాకాంక్షలు'

Last Updated : Sep 27, 2019, 2:25 AM IST

ABOUT THE AUTHOR

...view details