తన క్రికెట్ కెరీర్‌పై దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ప్రభావం చాలా ఉందని భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అన్నాడు. నాకు సందేహం వచ్చిన ప్రతిసారి, అతడి బౌలింగ్ వీడియోలు తప్పులు సరిదిద్దుకుంటానని తెలిపాడు. వాటి ద్వారా కొత్త కొత్త మెలకువలను నేర్చుకుంటుంటానని వెల్లడించాడు.
"2005 యాషెస్ సిరీస్‌లో వార్న్ బౌలింగ్ చూసి బౌలర్ కావాలని నిర్ణయించుకున్నా. ఆ తర్వాత పుణెలో భారత్-ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ సందర్భంగా అతడిని కలిశాను. ఆ సమయంలో స్పిన్ గురించి ఎన్నో మెలకువలు నేర్పాడు. మానసికంగా దృఢంగా తయారుచేశాడు. అలా మా ఇద్దరి మధ్య చక్కని బంధం ఏర్పడింది. ఇప్పటికీ రోజూ మేం వాట్సాప్‌లో చాటింగ్ చేసుకుంటూ ఉంటాం"