తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ధోనీ రిటైర్మెంట్​.. ఆ ఇద్దరికీ ప్రశాంతంగా నిద్ర' - next team india wicket keeper?

ధోనీ క్రికెట్​కు వీడ్కోలు పలికిన రోజు రాత్రి భారత యువ వికెట్​ కీపర్లు పంత్, కేఎల్ రాహుల్ ప్రశాంతంగా పడుకుని ఉంటారని అన్నాడు మాజీ క్రికెటర్ డీన్ జోన్స్. ఈ విషయమై తాను పందెం కూడా కాస్తానని చెప్పాడు.

'ధోనీ రిటైర్మెంట్​.. ఆ ఇద్దరికీ ప్రశాంతంగా నిద్ర'
ధోనీ

By

Published : Aug 17, 2020, 12:41 PM IST

టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ రిటైర్మెంట్​తో వికెట్​ కీపర్​ స్థానం కోసం కేఎల్ రాహుల్, పంత్​లకు తలుపులు తెరుచుకున్నాయని అన్నాడు ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డీన్ జోన్స్. మహీ వీడ్కోలు చెప్పిన రోజు రాత్రి వీరిద్దరూ ప్రశాంతగా నిద్రపోయి ఉంటారని ట్వీట్ చేశాడు.

"మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్​ ప్రకటించిన రోజు రాత్రి కేఎల్ రాహుల్, పంత్ ప్రశాంతంగా నిద్రపోయుంటారు. ఈ విషయమై పందెం కూడా కాసేందుకు సిద్ధమే" -డీన్ జోన్స్, ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్

గత 15 ఏళ్లుగా టీమ్​ఇండియా వికెట్​ కీపర్​ అంటే ధోనీనే. ఎప్పుడో ఒకటి రెండుసార్లు మినహా మిగతా వాళ్లకు అవకాశం వచ్చేది కాదు. గతేడాది ప్రపంచకప్​ సెమీస్​ తర్వాత క్రికెట్​కు తాత్కాలిక విరామం ప్రకటించాడు మహీ. అప్పటి నుంచి పంత్, కేఎల్ రాహుల్​లను కీపర్లుగా పరిశీలించింది మేనేజ్​మెంట్. అయితే ఇచ్చిన ఛాన్స్​లు సద్వినియోగం చేసుకోవడంలో పంత్​ విఫలమవగా, రాహుల్ మాత్రం చక్కగా రాణించాడు. బ్యాటింగ్​తో పాటు కీపింగ్​లోనూ అదరగొట్టాడు.

జోన్స్​తోపాటు భారత మాజీలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేఎల్ రాహుల్​కే తొలి ప్రాధాన్యమివ్వాలని అన్నారు. అందుకు కారణమూ లేకపోలేదు.

కేఎల్ రాహుల్-రిషభ్ పంత్

కేఎల్ రాహల్ వన్డేల్లో బ్యాటింగ్ సగటు గతేడాది 47.66 కాగా, ఇప్పుడు 70తో కొనసాగుతున్నాడు. ఈ ఫిబ్రవరిలో కివీస్​తో ఐదు మ్యాచ్​లు టీ20 సిరీస్​లో కీపర్​గానూ మెప్పించాడు ఈ ఆటగాడు. 4 స్టంపౌట్​లు చేయడం సహా 3 క్యాచ్​లు అందుకున్నాడు. పొట్టి ఫార్మాట్​లోనూ బ్యాటుతో అదరగొడుతున్నాడు. సంవత్సరం వ్యవధిలో ఇతడి సగటు 44.50 నుంచి 53.83కు పెరగడమే ఇందుకు ఉదాహరణ.

ABOUT THE AUTHOR

...view details